China: చైనా ఎందుకు క్రికెట్ ఆడటం లేదు.. దానికి గల కారణాలేంటి..?

China( చైనా ): ప్రపంచంలో క్రికెట్ కి ఎంత విపరీతమైన క్రేజ్ ఉందో అందరికీ తెలుసు.. ఇండియన్స్ అయితే దీన్ని మతంగా భావిస్తారు.. క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు ఆ రోజు టీవీ ముందుకు వాలి పోయి, వేరే ప్రపంచాన్ని మర్చిపోతుంటారు క్రికెట్ అభిమానులు.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే..ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎంతో ఉత్తేజాన్ని కలిగించే ఈ ఆట ను ప్రపంచంలోని అన్ని దేశాలు ఆడట్లేదు.. ముఖ్యంగా అన్ని ఆటలలో ముందుండే చైనా ఈ ఆటను ఆడడానికి ఇష్టపడట్లేదు ఎందుకో కారణాలు చూద్దాం..

Why China Didnt Play Cricket : చైనా
Why China Didnt Play Cricket

ప్రపంచ దేశాలు ఇష్టపడే క్రికెట్ ఆటను చైనా మాత్రం అడదు…. దానికి కారణాలు లేకపోలేదు.. ఒలంపిక్స్లో క్రికెట్ లేకపోవడంతో చైనా వారు ఒలంపిక్స్ లో లేని ఆటలు ఆడడం ఎందుకని పక్కన పెట్టేశారట.. అంతే కాదు మరి కొంతమంది కొంచెం విచిత్రంగా జవాబు ఇస్తారు.. ఇండియన్స్ ల మేము క్రికెట్ పై అంత టైం వెచ్చించడం ఇష్టం లేదు.. ఆ విధంగా మా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మేము క్రికెట్ ను మా క్రీడల లిస్టులో పెట్టుకోలేదు అంటున్నారు..

ఇక క్రికెట్ పుట్టినిల్లయిన ఇంగ్లాండ్ మన దేశాన్ని నాలుగు వందల ఏళ్లు పాలించిన విషయం తెలిసిందే.. ఆ 400 ఏళ్ల లో మనకు తెలియని ఎన్నో రకాల విషయాలను పరిచయం చేశారు.. అందులో ఒకటి క్రికెట్.. మొదట్లో మన ఇండియన్స్ కి క్రికెట్ అంటే ఏంటో తెలియదు మన దేశానికి వచ్చిన తర్వాత వారు ఇక్కడ వారికి క్రికెట్ ఆడటం నేర్పించారు.. అయితే చైనానీ బ్రిటిష్ వారు పరిపాలించ క పోవడం వల్లే అక్కడ క్రికెట్ అబ్బ లేదు అని ఒక వార్త ప్రచారంలో ఉంది.. క్రికెట్ అంటే క్రేజ్ చాలానే ఉన్న ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే ఫుట్ బాల్ కంటే తక్కువ క్రేజ్ ఉంది కాబట్టి చైనా కి ఇష్టం లేదు కానీ కొంతమంది చెబుతున్నారు.. లేట్ అయినా కూడా ఇప్పుడు క్రికెట్ టీమ్ లు తయారు చేసుకుంది చైనా మరో పదేళ్లలో ఇప్పుడున్న టీమ్లోకి పోటీ ఇస్తారో చూడాలి..

Advertisement