Chandrababu : చంద్రబాబు ఆ ఒక్క పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవడం పక్కా?

Chandrababu : ఏపీలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. టీడీపీ ప్రస్తుత పరిస్థితి ఇలా ఉండటానికి ముమ్మాటికీ చంద్రబాబే కారణం అని అంతా అనుకుంటున్నారు. 2019 ఎన్నికల వరకు ఏపీలో ఓ వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు ఏమాత్రం బలం లేకుండా… బలహీనంగా తయారైందంటే దానికి కారణం ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ ఫెయిల్యూర్ అనే చెప్పుకోవాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్షేత్రస్థాయి కార్యకర్తలను, నాయకులను పట్టించుకోలేదు అనే అపవాదు ఉన్నదే కదా. అప్పుడు ఆయన పార్టీని పట్టించుకోకపోవడం వల్ల పార్టీ ఘోరంగా ఓటమి పాలయిందని టీడీపీ నేతలే అంటున్నారు.

why chandrababu neglecting social media
why chandrababu neglecting social media

ఏది ఏమైనా… ప్రస్తుతం టీడీపీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఏ ఎన్నికల్లో అయినా ఘోరంగా ఓటమి చెందుతోంది. ఈనేపథ్యంలో పార్టీ చేయాల్సిన పని ఏంటి. పార్టీ ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి… అనే దానిపై టీడీపీలో ఆందోళన నెలకొన్నది. టీడీపీ నేతలు కూడా పార్టీ భవిష్యత్తుపై ఆందోళన పడుతున్నారు. అయితే… వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీ గెలవాలన్నా… చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నా.. ముందు చంద్రబాబు ఓ పని చేయాలని పార్టీ నేతలే అంటున్నారు.

ప్రస్తుత కాలం… టెక్నాలజీ యుగం. ప్రపంచమంతా టెక్నాలజీలో మునిగి తేలుతోంది. ప్రజలు కూడా ఎక్కువగా సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు.. సోషల్ మీడియాలో వచ్చేదే నిజం అని నమ్ముతున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబు సోషల్ మీడియాను ఎందుకు విస్మరిస్తున్నారు? అనే ప్రశ్న టీడీపీలో ఎదురవుతోంది. ఓవైపు అధికార పార్టీ వైసీపీతో పాటు ఇతర పార్టీలన్నీ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. తమ పార్టీని ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా బలంగా తీసుకెళ్తున్నాయి.

కానీ… చంద్రబాబు మాత్రం అస్సలు సోషల్ మీడియాను పట్టించుకోవడం లేదు. పార్టీని ముందుకు నడిపించాలంటే ఖచ్చితంగా సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని పార్టీ కార్యకర్తలు కూడా ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో.. నాయకత్వమే సరిగ్గా లేకపోతే ఎలా అనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నా… వచ్చే ఎన్నికల్లోపు పార్టీని గెలిపించాలన్నా.. సోషల్ మీడియా ముఖ్యమంటూ కార్యకర్తలు అంటున్నారు. అందుకే ఈ విషయంలో చంద్రబాబు కాస్త అయినా దృష్టి పెట్టి… సోషల్ మీడియాలో పార్టీని యాక్టివ్ చేయాలని కోరుతున్నారు. చంద్రబాబు పార్టీలోని కొందరికైనా సోషల్ మీడియా బాధ్యతలు అప్పగిస్తే.. వాళ్లు సోషల్ మీడియాలో పార్టీని బలోపేతం చేస్తారని… దాని ద్వారా మిగితా నాయకులు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. చూద్దాం మరి… చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి స్టెప్ వేస్తారో?

Advertisement