Bigg boss 4: రేస్ టు ఫినాలే.. అఖిల్, సోహెల్ కలిసి ఆడుతున్నారంటూ అభిజీత్ ఫైర్?

who will be the first in race to finale in bigg boss 4
who will be the first in race to finale in bigg boss 4

బిగ్ బాస్ షో ఇప్పుడిప్పుడే చాలా ఆసక్తిగా మారుతోంది. ఎందుకంటే.. రోజురోజుకూ హౌస్ లో కంటెస్టెంట్లు తగ్గుతున్నారు. దీంతో కాంపిటిషన్ పెరుగుతోంది. ఫేస్ మాస్కులను తీసేసి.. ఇప్పుడు రియాల్టీలోకి వస్తున్నారు కంటెస్టెంట్లు. నో సేఫ్ గేమ్స్ ఇక. ఓన్లీ రియల్ నేచర్.. అంటూ ఆడుతున్నారు.

who will be the first in race to finale in bigg boss 4
who will be the first in race to finale in bigg boss 4

నామినేషన్ విషయంలో కానీ.. టాస్క్ విషయంలో కానీ.. ఏమాత్రం మొహమాటపడటం లేదు ఇంటి సభ్యులు. ఫేస్ టు ఫేస్ చెప్పేస్తున్నారు. ఇది కదా కావాల్సింది. ఈ వారం నామినేషన్లలో అరియానా, సోహెల్ తప్ప మిగితా వాళ్లంతా ఉన్నారు. అంటే ఈవారం అఖిల్, అభిజీత్, మోనల్, అవినాష్, హారికల్లో ఎవరో ఒకరు బయటికి వెళ్లడం ఖాయం. అంటే ఇక మిగిలేది ఆరుగురే.

అంటే ఆట ఇంకా టఫ్ గా మారబోతోంది. తాజాగా బిగ్ బాస్ రేస్ టు ఫినాలే కు సంబంధించిన టాస్క్ ను ప్రారంభించాడు. రేస్ టు ఫినాలే మెడల్ ను దక్కించుకోవడం కోసం టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో గెలిచిన వాళ్లు డైరెక్ట్ గా ఫినాలేకు వెళ్తారు. అయితే.. ఈ టాస్క్ కోసం ఇంటి సభ్యులు బాగానే ప్రయత్నించారు. అయితే.. సోహెల్, అఖిల్ ఇద్దరు కలిసి ఆడుతున్నారని అభిజీత్ మధ్యలో ఆరోపించాడు.

వాళ్లిద్దరూ ఎవ్వరినీ పాలు పట్టుకోనీయకుండా అడ్డగిస్తూ వాళ్లిద్దరే పట్టుకుంటున్నారని.. ఇలా కలిసి ఆడటం ఏంటి.. అంటూ అఖిల్ తో వాగ్వాదానికి దిగాడు అభిజీత్.

దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా బిగ్ బాస్ విడుదల చేశారు. అసలు.. వీళ్లిద్దరూ కలిసి ఆడుతున్నారా? లేక సపరేట్ గా ఆడుతున్నారా? అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాక వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here