కరోనా వ్యాప్తికి యువతే కారణం : WHO సంచలనం
Admin - August 1, 2020 / 04:14 AM IST

ప్రపంచంలో కరోనా ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి యువత యొక్క నిర్లక్ష్యమే కారణమని డబ్ల్యూహెచ్వో అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వాళ్లకు వస్తుంది కానీ తమకు రాదని, తమకు రోగ నిరోధన శక్తి ఎక్కువనే అపోహలు వల్ల, తమకు వచ్చినా పరవలేదని నిర్లక్ష్య ధోరణి వల్లే కరోనా మహమ్మరిలా మారిందని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అఢనోమ్ ఘేబ్రీయోసస్ వెల్లడించారు. ముసలి వాళ్లకు, ఇంతకు ముందే జబ్బులు ఉన్నవారికి కరోనా ఎంత ప్రమాదకరమో యువతకు కూడా అంతే ప్రమాదకరమని అధికారులు తెలిపారు. ఈ కరోనా కాలంలో ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు విందులు, వివాహాలకు, సామూహిక సమావేశాలకు దూరంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో అధికారులు సూచించారు.