మరో వైరస్ ను ఎదుర్కోవాలి : WHO

Advertisement

ప్రపంచం కరోనా మహమ్మారితో భయాందోళనకు గురవుతుంది. ఒకవైపు ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు. రోజురోజుకి కేసులు మరింత పెరుగుతున్నాయి. అయితే కరోనా 2019 లో చైనా దేశంలో పుట్టినప్పటికీ ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలలో వ్యాపించింది. ముఖ్యంగా అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక ఈ సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన ప్రకటన చేసింది.

అయితే డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షులు టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ జెనీవాలో ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ.. ఇక ఇదే చివరి వైరస్ కాదని, ప్రపంచం మరొక వైరస్ కు సిద్ధంగా ఉంటే మంచిదని హెచ్చరించారు. అలాగే ప్రపంచదేశాలు ప్రజల ఆరోగ్యం కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సూచించాడు. కరోనా వైరస్ ఒక్కటే ప్రపంచానికి చివరిది కాదు, ముందు మరిన్ని ప్రాణాంతక వైరస్ లు వచ్చే అవకాశం లేకపోలేదని కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here