ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసిన WHO

Advertisement

కరోనా విషయంలో ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. కరోనాను నియంత్రించడానికి హార్డ్ ఇమ్మ్యూనిటి సరైన పరిష్కారం కాదని, హార్డ్ ఇమ్మ్యూనిటి సాధించడానికి కావలసిన రోగనిరోధకతను పొందే వీలు ఈ దరిదాపుల్లో లేదని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా కేవలం వ్యాక్సిన్‌ ద్వారానే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమని ప్రపంచ ఆరోగ్యసంస్థ అత్యవసర విభాగాధిపతి మైక్‌ రేయాన్‌ స్పష్టం చేశారు. వైరస్‌ నియంత్రణకు అసలు సహజ హెర్డ్‌ ఇమ్యూనిటీ సిద్ధాంతం పరిష్కారమే కాదని స్పష్టం చేసిన ఆయన.. కేవలం 10 నుంచి 20శాతం మంది మాత్రమే యాంటీబాడీలు కలిగి ఉన్న నివేదికల సారాంశాన్ని నొక్కిచెప్పారు.

ఈ వైరస్ నియంత్రణ కేవలం వ్యాక్సిన్ తోనే సాధ్యమని, ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ పై దృష్టి పెట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనావైరస్‌ ఇప్పటివరకు 2కోట్ల 20లక్షల మందిలో బయటపడింది. దీని బారినపడి ఇప్పటికే 7లక్షల 81వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here