రెండేళ్లు ఆగాల్సిందే : కరోనా పై WHO కీలక ప్రకటన
Admin - August 22, 2020 / 08:29 AM IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఈ వైరస్ ను నివారించేందుకు ప్రపంచ దేశాలలోని పరిశోధకులు అందరు కూడా వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నారు. తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజెషన్ (డబ్ల్యూహెచ్‌వో) కీలక ప్రకటన చేసింది. అయితే ఈ కరోనా సంక్షోభం రెండు ఏళ్లలో ముగుస్తుంది అని డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ వెల్లడించారు. అయితే 1918 సంవత్సరంలో వచ్చిన స్పానిష్ ఫ్లూ కూడా అంతం అవ్వడానికి రెండేళ్ల సమయం పట్టిందని అన్నాడు.
ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ దృష్ట్యా ప్రజలలో కరోనా తొందరగా వ్యాపిస్తుందని తెలిపాడు. అదే విధంగా ప్రస్తుతం మన దగ్గర ఉన్న అత్యాధునిక, పరిజ్ఞానం కూడా వైరస్‌ను నియంత్రించగలిగే సామర్థం ఉందని వెల్లడించాడు. ప్రస్తుతం సరికొత్త టెక్నాలజీ అందుబాటులో ఉంది. దీనితో రెండు ఏళ్ళ లోపే ఈ కరోనా వైరస్ నుండి విముక్తి కలిగే అవకాశాలు ఉన్నట్లు ఆయన అభిప్రాయం వ్యక్తం చేసాడు.