Bigg Boss 6 : బిగ్‌బాస్‌లో అసలు సిసలు తిండిపోతు ఎవరంటే.! సీక్రెట్ రివీల్ చేసిన నేహా చౌదరి.!

NQ Staff - September 27, 2022 / 08:35 PM IST

Bigg Boss 6 : బిగ్‌బాస్‌లో అసలు సిసలు తిండిపోతు ఎవరంటే.! సీక్రెట్ రివీల్ చేసిన నేహా చౌదరి.!

Bigg Boss 6 : బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో ఎలాంటి పర్ఫామెన్స్ లేకుండా, ఓన్లీ తిండి కోసమే హౌస్‌కొచ్చినట్లు ఫోకస్ అయిన ముద్దుగుమ్మ శ్రీ సత్య. హోస్ట్ నాగార్జున కూడా శ్రీ సత్యను అలాగే ప్రొజెక్ట్ చేశారు.

తిండి కోసమే హౌస్‌లోకి వచ్చావా.? అంటూ వేస్ట్ పర్‌ఫామర్ల లిస్టులో పడేశాడు పాపం శ్రీ సత్యని. దాంతో, శ్రీ సత్య అలాగే కన్‌వే అయ్యింది. సోషల్ మీడియా వేదికగా శ్రీ సత్య ఓ తిండిపోతు, పప్పు సుద్ద.. అంటూ దారుణంగా ట్రోల్స్ చేశారు.

కానీ, హౌస్‌లో అసలు సిసలు తిండిపోతు సింగర్ రేవంత్ అని తాజాగా హౌస్ నుంచి బయటికి వచ్చిన నేహా చౌదరి చెప్పింది. పాపం శ్రీ సత్య అలా కన్‌వే అయ్యింది కానీ, రేవంత్ దారుణమైన తిండిపోతు అని చెప్పింది.

ఎప్పుడు చూసినా తింటూనే వుంటాడట హౌస్‌లో. తన వాటా తిండి మాత్రమే కాదు, ఎదుటి వాళ్ల పళ్లెంలోంచి కూడా తీసుకుని తింటాడట సింగర్ రేవంత్. కానీ, నాగార్జున సైతం ప్రస్తావించడంతో శ్రీ సత్యయే హస్‌లో పెద్ద తిండిపోతుగా ప్రొజెక్ట్ అయ్యిందని నేహా చౌదరి చెప్పింది.

అడ్డంగా నేహాకి దొరికేసిన రేవంత్..

అంతేకాదు, యాపిల్స్ కూడా ట్రిప్‌కి రెండు, మూడు లాగించేస్తుంటాడట రేవంత్. రాత్రిళ్లు గుడ్లు మాయమైపోయేవట. అలాగే ఒకసారి దొంగతనంగా పెరుగు తింటూ అడ్డంగా నేహా చౌదరికి దొరికేశాడట సింగర్ రేవంత్.

అసలే హౌస్‌లో పెరుగు చాలా అరుదు. ఒక కప్పు పెరుగును మజ్జిగలా చేసుకుని నలుగురైదుగురు తింటారట. అలాంటిది, ఒక ఫుల్ కప్ పెరుగును స్పూన్ వేసుకుని దొంగచాటుగా రేవంత్ ఒక్కడే తినేయడం నేహా చౌదరి గుర్తించిందట హౌస్‌లో. తాజాగా ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నేహా చౌదరి రేవంత్ గురించి ఈ షాకింగ్ విషయాల్ని బయట పెట్టింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us