ఈ సారి బిగ్ బాస్ 4 లో ఇంత మంది స్టార్ లా ….?

Advertisement

ఈ సారి నిర్వహించ బోయే బిగ్ బాస్ 4 ని బారి ఎత్తులో ప్లాన్ చేస్తుంది మా యాజమాన్యం. బిగ్ బాస్ 4 లో పాల్గొనబోయే కంటెస్ట్ లందరిని కూడా ఆచి తూచి మరింత వినోదం అందించాలనే విధంగా అలోచించి ప్రేక్షకులకు ఎంత గానో దగ్గరైన స్టార్లని మాత్రమే తీసుకోబోతుంది అంట. అసలు ఎవరు ఆ స్టార్ లు? బిగ్ బాస్ 4 కి సంబంధించిన మరిన్ని వివరాలు తెల్సుకుందామా మరి … బిగ్ బాస్ విడుదలైన అన్ని భాషల్లో కూడా సంచలనాలను సృష్టించిన షో .. ఇక తెలుగు లో వచ్చిన 3 సీసన్ లు కూడా ప్రేక్షకుల కు ఏ రేంజ్ లో నచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇలా వచ్చిన ప్రతి సీసన్ కూడా సంచలనమైన విజయాన్ని సాధించి మరింత ప్రేక్షకులకు నచ్చుతుండడం తో ఈ సారి రాబోతున్న బిగ్ బాస్ సీసన్ 4 ని మరింత సరి కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేయబోతుంది అంట. అయితే ఎప్పుడు లేనంతగా మొదటి సారి గా తెలుగు లోనే బిగ్ బాస్ సీసన్ 4 కి సమంత ని లేడీ హోస్ట్ గా తీసుకోనున్నారు అన్న వార్త ఎప్పటి నుండో సోషల్ మీడియా లలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా బిగ్ బాస్ లో గతం లో ఉన్న టాస్క్ లు కాకుండా కొత్తగా ఆమర్చి మొత్తం గేమ్ ని సరి కొత్తగా ప్రెసెంట్ చేయనున్నట్లు తెలుస్తుంది

అంతలా ప్రత్యేకతలు కలిగినటువంటి సీసన్ 4 కి కంటెస్టెంట్ ని కూడా ఆ రేంజ్ లో తీసుకోవాలనుకుంటున్నారు మా సభ్యులు .. మరి ఆ కంటెస్టెంట్
లు ఎవరు అని తెలుసుకొనే విషయానికి వస్తే లవర్ బాయ్ హీరో తరుణ్, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది, హీరో నందు, యాంకర్ ఝాన్సీ , సింగర్ సునీత, శ్రద్ధ దాస్, వర్షిణి, వైవా హర్ష, తాగు బోతు రమేష్ వీళ్లందరితో పాటు మరికొందరిని బిగ్ బాస్ సీసన్ 4 కి కంటెస్టెంట్ లు గా తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇందులో ఇప్పటికే కొంత మంది తో సంప్రదింపులు జరుపగా మరి కొంత మంది తో కూడా త్వరలోనే చర్చించబోతున్నారు అన్న సమాచారం బయటపడుతుంది… అయితే చివరి వరకు ఎవరెవర్ని తీసుకొనే అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం ఇంకా తెలియనప్పటికీ. ఈ సీసన్ పైన ప్రస్తుతం ప్రజల్లో పెరుగుతున్న అంచనాలు మరియు అందుతున్న ఆదరణ చూస్తుంటే బిగ్ బాస్ 4 కి గతం లో వచ్చిన మూడు సీసన్ ల కంటే ఎక్కువ మొత్తం లో టీఆర్పీ రేటింగ్ మరియు క్రేజ్ లభిస్తుంది అనే అనిపిస్తుంది

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here