కొంప మునిగింది : యూకే లో వచ్చిన కొత్త కరోనా గురించి సౌమ్య స్వామినాథన్ చెప్పిన నిజాలు !
Admin - January 6, 2021 / 03:29 PM IST

బ్రిటన్ దేశంలో రూపాంతరం చెంది అలజడి సృష్టిస్తున్న కొత్త కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ సంచలన విషయాలు బయటపెట్టారు. అయితే ఈ కొత్త రకమైన కరోనా వైరస్ ను బ్రిటన్ లో తాము సెప్టెంబర్ లోనే గుర్తించినట్లు తెలిపింది. అలాగే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ వైరస్ విస్తరించినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఈ వైరస్ స్ట్రెయిన్ 70 శాతం వరకు స్పీడ్ లో వ్యాప్తి చెందుతున్నట్లు పేర్కొంది. మరి ఈ వార్తను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంత ఆలస్యంగా ఎందుకు చెప్పిందో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. మొత్తానికి బ్రిటన్ లో పుట్టుకొచ్చిన కొత్త రకమైన కరోనాతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫెయిల్యూర్ అయిందనే చెప్పాలి.
ఇకపోతే ప్రస్తుతం రూపొందిస్తున్న వ్యాక్సిన్ కొత్త రకమైన కరోనా ను ఎదుర్కునే సామర్థం ఉందని చెప్పుకొస్తున్నారు. అయితే జీనోమ్ సీక్వెన్సింగ్ సామర్థం ఉన్న దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. దీనితో తక్కువ సమయంలోనే ఈ వైరస్ ను గుర్తించగలని భావిస్తుంది. ఇప్పటికే ఇటలీలో ఒక వ్యకికి ఈ కొత్త రకమైన వైరస్ బారిన పడితే బ్రిటనే గుర్తించినట్లు చెప్పుకొచ్చింది. ఒకవైపు ఆస్ట్రేలియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాలో కూడా ఈ కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలిపింది. ముందు ఈ వైరస్ కు సంబందించిన జన్యు శ్రేణిని గుర్తించాలని ఆమె కోరినట్లు పేర్కొంది.
జీనోమ్ సీక్వెన్సింగ్ సామర్థం భారత్ కు ఎక్కువగా ఉందని, దాదాపు 3 లక్షల సీక్వెన్స్ లు భారత్ కు ఇప్పటికే అందాయని చెప్పుకొచ్చింది. ఇక ఇవన్నీ భారత్ కు ఉపయోగపడుతున్నాయని చేబుతుంది. ఇక ప్రస్తుత కొత్త కరోనా వైరస్ నేపథ్యంలో పాత పద్దతిలో లాగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కరోనా టెస్టులు నిర్వహించి, పాజిటివ్ వచ్చిన వారికి క్వారంటైన్ లో ఉంచాలి. ఇక కొత్త వైరస్ దాటికి పాత పద్ధతిలోకే వచ్చే పరిస్థితులు ఉన్నాయని తెలుస్తుంది. కొత్త సంవత్సరంలో కి పాజిటివ్ గా అడుగు పెడదామని అనుకున్న సమయంలో, కొత్త వైరస్ తో కాస్త వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.