Lord Shiva : శివుడి ముగ్గురి కూతుర్ల గురించి మీకు తెలుసా… వారు ఎవరెవరంటే..!!

Lord Shiva : ప్రపంచ దేవుళ్లలో ఎంతో పవర్ ఫుల్ దేవుడిగా శివుడి ని పూజిస్తారు హిందువులు.. ఏ దేవుడి పట్లనైనా అజాగ్రత్తగా ఉంటే నడుస్తుందేమో కానీ ఈయన వద్ద అజాగ్రత్తగా ఉంటే మాత్రం అస్సలు కుదరదు.. ఆయనకు చేసే పూజ విదధానంలో ఏదైనా పొరపాటు ఉంటే వెంటనే శిక్షిస్తాడని భక్తుల నమ్మకం.. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.. ఆ దేవాలయాల్లో నిత్యం పూజలు, పునస్కారాలు జరుగుతూ ఉంటాయి ఆయనకు.. అలాంటిశివుడికి మొత్తంగా సుబ్రమణ్య స్వామి, వినాయకుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారని అందరికి తెలుసు..

Do you Know About Lord Shiva Daughters : శివుడి
Do you Know About Lord Shiva Daughters

అయితే ఆయనకు ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు… ఇన్నాళ్లు ఆయనకు కుమారులు మాత్రమే ఉన్నారని తెలిసిన వారు కూతుళ్లు కూడా ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.. శివుడికి అశోక సుందరి, మానస, జ్యోతి అని ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పద్మ పురాణంలో అధిక సుందరి కి చెందిన అన్నివివరాలు మనం తెలుసుకోవచ్చు.గుజరాత్ లో ఎక్కువగా ఈమెని గురించిన కథనాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఈమెను పూజిస్తారు. శివుడు వినాయకుడి తలను నరికినప్పుడు ఈమె పక్కనే ఉందని , ఉప్పు బ‌స్తా ప‌క్క‌న దాక్కుని కథ ఉంది.

మానస కు పాముకాటుకు గురైనవారిని కాపాడే దేవతగా పేరుంది. పాముల జాతికి చెందిన క్షుద్రకు శివుడికి ఈమె జన్మించిందట.. స‌ముద్ర మ‌థ‌నం సంద‌ర్భంగా శివుడు గ‌ర‌ళాన్ని తాగిన‌ప్పుడు మాన‌స శివున్ని ర‌క్షించింద‌ని చెబుతారు. అయితే శివుడు పార్వతి తన భర్త ఆమెను సరిగ్గా ఆదరించలేదని అందుకే ఆమె ఎక్కువగా కోపంగా ఉంటుందని చెబుతారు. పశ్చిమ బెంగాల్ లో ఎక్కువగా పూజిస్తారు. ఇక శివుడి దివ్య జ్యోతి నుంచి అయన మూడో కుమార్తె జ్యోతి జన్మించాడని చెబుతారు. ఈమెను ర‌య‌కి దేవ‌త అని పిలుస్తారు. ఉత్త‌రాదిలో జ్వాలాముఖి పేరిట ఈమెకు పూజ‌లు చేస్తారు.

Advertisement