వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేత ఓ మేల్కొలుపు : డబ్ల్యూహెచ్ఓ

Advertisement

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక ఈ మహమ్మారి విస్తరణను అడ్డుకట్ట వేయడానికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నాయి. ఇక ఇదే క్రమంలో తాజాగా ఓ వ్యాక్సిన్ ట్రయల్స్ ను నిలిపి వేశారు. దీనికి డబ్ల్యూహెచో స్పందిస్తూ.. చివరి దశలో ఉన్న వ్యాక్సిన్‌ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేయడం ఓ మేల్కొలుపు మాత్రమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇక క్లినికల్‌ ట్రయల్స్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ వెల్లడించారు. అలాగే ఇలాంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని ఆమె అభిప్రాయ పడింది. అయితే వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్న శాస్త్రవేత్తలు మాత్రం నిరుత్సాహం చెందవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. వ్యాక్సిన్‌ ట్రయల్స్ లో ఇలాంటి పరిస్థితులు సాధారణంగా వస్తాయని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here