తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎక్కడ?

Advertisement

ప్రస్తుతం తెలంగాణ ప్రజల నోట్ల నుండి వస్తున్న ఒకే ఒక్క మాట.. కెసిఆర్ ఎక్కడ…? ఏమయిపోయాడు…? ఇందుకింత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలను పట్టించుకోవడం లేదు.. ? మరి ఈ మాటలన్నీ ప్రజల్లో తలెత్తడానికి గల కారణాలు లేకపోలేదు. గతం లో కరోనా భారత్ లో ఎంటర్ అవ్వగానే దానికి తగిన జాగ్రత్తలు అన్ని తీసుకొని అన్ని రాష్ట్రాల కంటే తక్కువ సంఖ్యలో కేసులు నమోదు అయ్యేలా చేసి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలబడ్డాడు కెసిఆర్. ప్రజలకు కావాల్సిన మాస్క్ లు, శానిటైజర్ లు, హెల్త్ కిట్ లు మరియు మెషిన్ లు ఇలా అన్ని సమకూర్చి అందరి కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అన్ని రాష్ట్రాల కంటే ముందే స్కూల్ లు కాలేజీ లకు మరియు రద్దీగా ఉండే ప్రదేశాలకు లాక్ డౌన్ ప్రకటించి కట్టు దిట్టమైన ఏర్పాట్ల తో కరోనా ని కట్టడి చేయడం లో ఘణ విజయం సాధించాడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్.

మరి ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోజు వేయి కి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రజలు తీవ్ర బాయందోళనలకు గురవుతున్నారు. మొదట్లోనే అన్ని జాగ్రత్తలు తీసుకొని మీకు కష్టం రాక ముందే అడ్డుగా నేను ఉండి ఆ సమస్య ని పరిష్కరిస్తాను అంటూ చెప్పుకొచ్చిన కెసిఆర్ ఇప్పుడు రాష్రమ్ లో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నప్పటికీ పట్టించుకోవడం కాదు కదా.. అస్సలు బయటకి వచ్చి ఈ విషయం పైన అస్సలు నోరు కూడా మెదపడం లేదు. ఇక కరోనా టెస్ట్ ల గురించి కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే వెనుకపడిపోయింది.

ఇంత వరకు తెలంగాణ లో కేవలం లక్ష కి దగ్గరికి గా మాత్రమే కరోనా టెస్ట్ లు నిర్వహించడం జరిగింది దానిలో 20 వేళా కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. అంటే దాదాపుగా టెస్ట్ చేసిన వరకే 20 శాతం కేసులు నమోదు కావడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయి పరీక్షలు జరిపితే ఇంకా ఎన్ని కేసులు బయట పడుతాయో కూడా తెలియడం లేదు. ఇలాంటి సమయం లో పూర్తి స్థాయి పరీక్షలు అన్ని చోట్ల జరిపించి బయట పడిన కేసుల్ని బట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా కల్లబొల్లి మాటలు చెప్పి నెట్టొకొస్తున్న ప్రభుత్వం పట్ల ప్రజలు కూడా అసంతృప్తి కి గురవుతున్నట్లు తెలుస్తుంది.

అన్ని రాష్ట్రాల పరీక్షల ఫలితాల తో పోలిస్తే తెలంగాణ లో నిర్వహించిన పరీక్షల్లోనే 20 శాతం పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇలా తెలంగాణ కరోనా కేసుల నమోదు శాతం దృష్ట్యా అన్ని రాష్ట్రాల ని దాటుకొని మొదటి స్థానం లో ఉంది. అయితే ఇంతలా కేసులు నమోదు అవుతున్న తెలంగాణ రాష్ట్రం లో కరోనా పరీక్షలు సరిగా నిర్వహించడం లేదు అన్న విషయం లో ఇప్పటికే హై కోర్ట్ కెసిఆర్ మరియు
టీఆరెస్ ప్రభుత్వానికి వార్ణింగ్ ఇస్తూ లేఖ పంపినట్లు తెలుస్తుంది. ఆ లేఖ లో మీరు పెరుగుతున్న కేసుల నమోదు దృష్ట్యా తెలంగాణ పరీక్ష లు కూడా అన్ని చోట్ల పెంచాలి అలా ఎక్కువ స్థాయిలో పరీక్షలు నిర్వహించనట్లైతే మీరు మరియు మీ హెల్త్ మినిస్టర్ లు హై కోర్ట్ న్యాయస్థానం లో హాజరు కావాల్సి ఉంటుంది అంటూ తెలపడం జరిగింది. అన్న సమాచారం అందుతుంది.

అయిన అసలు కెసిఆర్ ఈ విషయం పైన ఇంత వరకు ముందడుగు వేయకపోవడం, ప్రజల తో మాట్లాడకపోవడం తో అసలు కెసిఆర్ ఎక్కడ …? ఏమయిపోయాడు ….? కొంప తీసే కెసిఆర్ కి కరోనా రావడం వలన హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నాడా అన్న అనుమానులు కూడా ప్రజలలో తలెత్తున్నాయి.. అయితే దాని పైన టి ఆర్ ఎస్ నాయకులు స్పందించి అలాంటిదేమి లేదు అంటూ తెలపడం జరిగింధి. మరి మొదట్లో కరోనా కట్టడి లో ముందంజలో ఉన్న కెసిఆర్ ఎక్కడికి పోయాడు అంటూ కొంత మంది వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా లో కామెంట్స్ ద్వారా తెలుపుతుండగా మరి కొంత మంది మీమ్స్ ద్వారా పోస్ట్ చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here