Jagan and KCR : వాళ్లకు న్యాయం చేసేదెప్పుడు? జగన్, కేసీఆర్ ఇకనైనా వాళ్ల గురించి ఆలోచిస్తారా?

Jagan and KCR : ప్రస్తుతం తెలంగాణలో ఒక్కటే హాట్ టాపిక్. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. పీఆర్సీ గురించి ప్రకటన చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా పెంచడంతో… ప్రభుత్వ ఉద్యోగులు చాలా సంతోషంలో ఉన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ… కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడింది.

కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు… ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలోనూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదే తప్పును రిపీట్ చేస్తున్నారు అనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామంటూ ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదు.

అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా జీతాలు పెరుగుతాయని హామీ ఇచ్చారు కానీ… వాళ్ల ఉద్యోగాల పర్మినెంట్ విషయంలో మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో ఆయా ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.

ఏపీలోనూ అదే పరిస్థితి నెలకొన్నది. ఏపీ సీఎం జగన్ కూడా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనే ప్రచారం సాగుతోంది. దీంతో ఏపీలోనూ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు కల్పించే సదుపాయాలు… కాంట్రాక్ట్ ఉద్యోగులకు కల్పించకపోవడంతో వాళ్లకు సరైన న్యాయం జరగడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అయితే.. ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఏపీ ప్రభుత్వం కార్పొరేషన్ ను కూడా ఏర్పాటు చేసింది. కానీ… ప్రభుత్వం ఉద్యోగులకు ఉన్న ఫెసిలిటీస్ వీళ్లకు లేవు. దీంతో వీళ్లను ప్రభుత్వం ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తుందోనని అంతా వేచి చూస్తున్నారు.

Advertisement