WhatsApp: ఇప్ప‌టి నుండి వాట్సాప్‌లో డిలీటైన మెసేజ్‌లు కూడా చూడొచ్చు..!

WhatsApp: డిజిట‌ల్ యుగంలో సోష‌ల్ మీడియాకు చాలా ప్రాధాన్య‌త పెరిగింది. చిన్న పిల్లాడి నుండి పెద్ద వాళ్ల వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్నారు. ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్ బుక్, వాట్సాప్ ఇవి ప్ర‌తి ఒక్క‌రి ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో కామ‌న్‌గా ఉంటుంది. వాట్సాప్‌ని చాలా ఎక్కువ మంది ఉప‌యోగిస్తున్నారు. ఇందులో ఉన్న ఆప్ష‌న్స్ యూజ‌ర్స్‌కి చాలా సుల‌భంగా అర్దం కావ‌డంతో పాటు వాడుక‌కు ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. అయితే నిత్యం వాట్సాప్ వినియోగ‌దారుల సంఖ్య పెరుగుతూ పోతున్న నేప‌థ్యంలో ఆప్ష‌న్స్ కూడా క్ర‌మక్రేమేపి పెంచుతున్నారు.

WhatsApp

మొన్న‌టి వ‌ర‌కు వాట్సాప్‌లో ఏదైన మెసేజ్ డిలీట్ అయింది అంటే అది తిరిగి పొందడం చాలా క‌ష్టంగా మారేది. సాధార‌ణంగా వాట్సాప్‌లో అవ‌స‌రం లేవు అనుకునే మెసేజ్‌ల‌ని డిలీట్ చేస్తుంటాం. అనుకోకుండా ఇంపార్టెంట్ మెసేజ్ కూడా డిలీట్ అయితే కొంద‌రికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం వాట్సాప్ కొత్త యాప్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్ మ‌న ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లాలి. అందులో Notisave యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. కొన్ని ప‌ర్మీష‌న్స్ అడ‌గ‌గా, వాటిని అనుమ‌తించాలి. ఆటో-స్టార్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత వాట్సాప్ లో పంపిన ప్రతీ ఫోటోలు, ఫైల్‌లు, మీడియాతో సహా NotiSave యాక్సస్ చేయబడుతుంది.

WhatsApp

NotiSave యాక్సస్ చేయబడిన త‌ర్వాత మీరు అందుకున్న నోటిఫికెష‌న్స్, మెసేజ్‌ల‌ను యాప్ ట్రాక్ చేస్తుంది. దీంతో సందేశాలు డిలీట్ అయిన కూడా నోటిసేవ్ యాప్ ద్వారా చ‌ద‌వొచ్చు. మీరు అనుకోకుండా లేదా అనుకోకుండా స్వైప్ చేసిన నోటిఫికేషన్‌లను కూడా మీరు చదవవచ్చు. ఇది కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. iOS యూజర్లకు ఇది పనిచేయదు. నిత్యం వినూత్న ఆఫ‌ర్స్‌తో ముందుకు వ‌స్తున్న వాట్సాప్ వినియోగ‌దారుల‌కి సౌల‌భ్యంగా పని చేస్తుంది.