WhatsApp : వాట్సప్ లో వచ్చిన ఈ కొత్త ఫీచర్‌ ను గుర్తించారా?

NQ Staff - June 7, 2023 / 09:46 PM IST

WhatsApp : వాట్సప్ లో వచ్చిన ఈ కొత్త ఫీచర్‌ ను గుర్తించారా?

WhatsApp : గూగుల్ మీట్ మరియు జూమ్‌ ను ఎక్కువగా వర్క్‌ మీటింగ్స్ కు వినియోగిస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో చాలా మంది వాట్సప్ ను కూడా గ్రూప్ మీటింగ్‌ ల కోసం వినియోగిస్తున్నారు. కానీ స్క్రీన్‌ షేరింగ్‌ ఆప్షన్ లేకపోవడం వల్ల వాట్సప్‌ వీడియో కాలింగ్‌ ఆప్షన్‌ ని కొందరు వినియోగించడం లేదు అనే విషయం అందరికి తెల్సిందే.

ఇప్పుడు వాట్సప్‌ లో కొత్తగా స్క్రీన్‌ షేరింగ్‌ ఆప్షన్‌ వచ్చింది. సింగిల్ గా వాట్స్‌ వీడియో కాలంగా మాట్లాడుకుంటూ ఉన్నా కూడా స్క్రీన్‌ షేరింగ్‌ ఆప్షన్ ను వినియోగించుకోవచ్చు. మొబైల్ తో పాటు వాట్సప్‌ లాప్ టాప్‌ లో వాడుతున్న వారు కూడా ఈ ఫీచర్ ను వినియోగించుకోవచ్చు అంటూ తాజాగా వాట్సప్ ప్రకటించింది.

ఇప్పటికే ఎన్నో విప్లవాత్మక ఫీచర్స్ ను తీసుకు వచ్చి ప్రపంచంలోనే అత్యధికులు వాడుతున్న యాప్స్‌ లో ఒకటిగా నిలిచిన వాట్సప్‌ ఇప్పుడు స్క్రీన్ షేరింగ్‌ ఆప్షన్ తో మరింతగా ఆధరణ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ టెక్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సప్‌ లో వస్తున్న ఫీచర్స్ కారణంగా జీమెయిల్‌ మరియు జూమ్‌ లకు పోటీ అన్నట్లుగా ఉంటుంది. తాజాగా మరోసారి వాట్సప్‌ షేరింగ్‌ ఆప్షన్ తో వాటికి గట్టి పోటి అన్నట్లుగా నిలుస్తుంది. ప్రస్తుతం వాట్సప్ ను ఇండియాతో పాటు పలు దేశాల్లో ఉచిత సర్వీస్ లుగానే ఇస్తున్నారు.

Read Today's Latest Technology in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us