Whatsapp : యూట్యూబ్, ఫేస్ బుక్ ను తలదన్ని ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన వాట్సప్

Whatsapp : వాట్సప్ తెలుసు కదా. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వాట్సప్ లేని ఫోన్ ఉండదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లే. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాట్సప్ వాడుతుంటారు. ఎందుకంటే.. ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు.. వాట్సప్ ద్వారా ఉచితంగా వీడియో కాల్స్, వాయిస్ కాల్స్, చాట్ చేసుకునే వెసులు బాటు ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా.. రీచార్జ్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా.. ఉచితంగా మాట్లాడుకునే సదుపాయం ఉన్నప్పుడు ఎవరు మాత్రం వద్దంటారు. అందుకే.. వాట్సప్ కు ఇండియాలో అదరణ పెరిగింది. అసలే.. ప్రస్తుతం పరిస్థితులు కూడా బాగా లేవు. బయట అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఎవరినీ కలవడానికి వీలు లేదు కాబట్టి.. వాట్సప్ లో వీడియో కాల్ చేసి ఏం చక్కా మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది. ఇలా.. వాట్సప్ లో చాలా ఫీచర్స్ ఉండటంతో.. ఇండియన్స్ దీనికి బాగా అలవాటు పడిపోయారు.

whatsapp has highest users in india
whatsapp has highest users in india

అలాగే.. వాట్సప్ కూడా ఎప్పటికప్పుడు తన యూజర్లను ఆకర్షించడం కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. అందుకే కాబోలు.. వాట్సప్ ఇండియాలో యూట్యూబ్ ను, ఫేస్ బుక్ ను, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి అన్ని సోషల్ మీడియా సంస్థలను దాటేసి.. టాప్ ప్లేస్ లో నిలిచింది. భారతదేశంలోనే ఏ మెసేజింగ్ యాప్ కు, ఏ సోషల్ మీడియా సైట్ కు లేనంత వినియోగదారులు.. వాట్సప్ కు ఉన్నారు. అలాగే రోజురోజుకూ వాట్సప్ యూజర్ల సంఖ్య పెరుగుతోందట.

ఫిబ్రవరి 2021 వరకు ఇండియాలో ఏ యాప్ ను ఎక్కువగా వాడుతున్నారు.. అనే దానిపై వివరాలు సేకరించిన కేంద్రం.. దానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. వాట్సప్ కు అన్ని యాప్స్ కన్నా ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. వాట్సప్ కు 53 కోట్ల మంది యూజర్లు ఇండియాలో ఉన్నారు. వాట్సప్ తర్వాత యూట్యూబ్ కు 44.8 కోట్ల మంది ఉన్నారు. ఫేస్ బుక్ కు 41 కోట్ల మంది, ఇన్ స్టాగ్రామ్ కు 21 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.