Whatsapp : వాట్సప్ లో ఇకపై 1024.. వాళ్లకి గుడ్ న్యూస్
NQ Staff - October 12, 2022 / 09:06 AM IST

Whatsapp : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ కలిగిన మెసెంజర్ యాప్ గా వాట్సప్ నిలిచింది అనడంలో సందేహం లేదు. ఈ మెసేజ్ యాప్ వాట్సప్ వ్యాపారస్తులకు గ్రూప్స్ నిర్వహించుకొని టీమ్ మెంబర్స్ తో కలిసి ఉండేలా అవకాశాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే.
వాట్స్అప్ గ్రూప్లో ఒకప్పుడు 256 మంది మాత్రమే ఉండే అవకాశం ఉంది, కానీ ఆ తర్వాత గ్రూప్ సభ్యుల సంఖ్య 512 కు పెంచింది పెరుగుతున్న అవసరాలు ఇతర కారణాల కారణంగా త్వరలోనే ఒక గ్రూపులో 1024 మంది ఉండేలా వాట్సప్ అనుమతించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.
భారత్ తో పాటు పలు దేశాల్లో వ్యాపారస్తులు మరియు విద్యా సంస్థలు ఇంకా ఎన్నో సంఘాలు వర్గాల వారు వాట్సాప్ గ్రూపులను వినియోగిస్తున్నారు. వందల సంఖ్యలో మెంబర్స్ ఉంటారు కనుక ఆ విషయంలో వాట్సాప్ గ్రూప్ లు ఎక్కువగా మైంటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇప్పుడు 1024 మంది ఒకే గ్రూపులో ఉండే అవకాశం కల్పించడం ద్వారా వారికి వెసులు బాటు కలిగించినట్లు అవుతుంది. ప్రస్తుతం ఒక గ్రూపులో రెండు లక్షల మంది వరకు చేరి చాట్ చేసే సదుపాయంలో టెలిగ్రామ్ కలిగించింది.
అదే ఫీచర్ ని త్వరలోనే వాట్సప్ కూడా తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది, అయితే సెక్యూరిటీ విషయంలో మరియు ఇతర విషయాల పట్ల వాట్స్అప్ కాస్త ఎక్కువ ఆలోచిస్తూ జాగ్రత్తలు తీసుకొని ఆ ఫీచర్ తో యూజర్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వాట్సాప్ ముందు ముందు కచ్చితంగా ఎన్నో విప్లవాత్మక అప్డేట్స్ ని తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.