Whatsapp: తిరిగి అందుబాటులోకి వాట్సాప్,ఇన్‌స్టాగ్రామ్,ఫేస్ బుక్ సేవ‌లు..!

Whatsapp: సోష‌ల్ మీడియా ఒక్క‌సారిగా స్తంభిస్తే ఎలా ఉంటుందో ఆదివారం అంద‌రం చూశాం. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‎బుక్, ఇన్‎స్టాగ్రామ్, వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. రాత్రి 9 గంటల నుంచి ఫేస్‎బుక్, ఇన్‎స్టాగ్రామ్, వాట్సప్ పని చేయలేదు. ఇది వరకు ఈ సేవల్లో అంతరాయం ఏర్పడితే కేవలం 5 నుంచి 10 మాత్రమే ఇబ్బంది తలెత్తేది. కానీ ఇప్పుడు దాదాపు 20 నిమిషాలకు పైగా సేవలు నిలిచిపోయాయి.

WhatsApp, Facebook, Instagram restore services after 6 Hours
WhatsApp, Facebook, Instagram restore services after 6 Hours

సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను వినియోగించే కోట్లాది మంది వినియోగదారులు చాలా ఇబ్బంది ప‌డ్డారు. ఈ సోషల్ మీడియా నెట్ వర్క్స్ ఇంతసేపు నిలిచిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వీటిపై సైబర్ అటాక్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు ఇది చైనా పనే అన్న అనుమానం వ్యక్తం చేసింది అమెరికన్ ఇంటెలిజెన్స్. మరోవైపు సాంకేతిక సమస్యలే కారణం అని ఎఫ్బీ చెబుతోంది.

తెల్ల‌వారుఝామున నాలుగు గంట‌ల నుండి వాట్స‌ప్ సేవ‌ల‌ను తిరిగి పున‌రుద్ద‌రించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా మాపై ఆధార‌ప‌డిన కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు, వ్యాపార కార్య‌క‌లాపాల‌ను న‌డుపుతున్న వారికి క్ష‌మాప‌ణ‌లు.నిలిచిపోయిన సేవ‌ల‌ను తిరిగి పున‌రుద్ధిరించినందుకు సంతోషంగా ఉంది. అని ఫేస్ బుక్ పేర్కొంది.

సోష‌ల్ మీడియాకు సంబందించి ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఒక్క‌సారిగా ఆగిపోవ‌డంతో వేరే మాధ్య‌మాలపై దృష్టి పెట్టారు నెటిజ‌న్స్. భారత్ లో ఫేస్‌బుక్ సంస్థకు 410 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. అలాగే, వాట్సప్ మెసెంజర్ కు 530 మిలియన్ల యూజర్లు, ఇన్ స్టాగ్రామ్ కు 210 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు.