Sagar by poll : సాగర్ ఉపఎన్నికలో కేసీఆర్ ప్లాన్ ఏంటి?

Sagar by poll : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా నాగార్జునసాగర్ ఉపఎన్నిక గురించే చర్చ. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వేడి బాగా రాజుకుంది. ఎక్కడ చూసినా అదే చర్చ. సాగర్ ఉపఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? జానారెడ్డి గెలుస్తారా? లేక టీఆర్ఎస్ గెలుస్తుందా? లేక రెండు పార్టీలకు షాక్ ఇచ్చి బీజేపీ గెలుస్తుందా? ఇలా ఎవరికి వాళ్లు బేరీజులు వేసుకుంటున్నారు.

what is kcr plan in nagarjuna sagar by poll
what is kcr plan in nagarjuna sagar by poll

నిజానికి నాగార్జునసాగర్ సీటు టీఆర్ఎస్ దే. టీఆర్ఎస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే నోముల ఆకస్మిక మరణంతో.. ప్రస్తుతం ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆయన మరణించడంతో… సానుభూతి వర్కవుట్ అవుతుందని ఆయన కొడుకుకే సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం సీనియర్ నేత జానారెడ్డికే టికెట్ ను కేటాయించింది. బీజేపీ రవి కుమార్ కు టికెట్ కేటాయించింది.

ఇప్పటికే దుబ్బాకలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కొద్దితేడాలో ఓడిపోయింది. బీజేపీ అక్కడ గెలుపు బావుటా ఎగురవేయడంతో…. దుబ్బాక జరుగుతున్న మరో ఉపఎన్నిక సాగర్ దే కావడంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో టీఆర్ఎస్ పార్టీ ఉంది.

అందుకే… ఈసారి ఏకంగా సీఎం కేసీఆర్ ఈ ఎన్నికలపై దృష్టి సారించారు. ఆయనే రంగంలోకి దిగారు. సీఎం కేసీఆర్ స్వయంగా సాగర్ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ వ్యూహాలు రచిస్తే… వాటిని అమలు చేయడం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పని అంటూ ప్రచారం సాగుతోంది. సాగర్ లో ఎక్కువ ఉన్నది యాదవులవి. యాదవుల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండటంతో… యాదవ వర్గానికి చెందిన మంత్రి తలసానిని సాగర్ లో రంగంలోకి దింపారు. అక్కడి నుంచే కేసీఆర్ వ్యూహాలను తలసాని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరి… కేసీఆర్ వ్యూహాలు ఏంటి? సాగర్ గెలుపు కోసం ఎలాంటి స్పెషల్ ప్లాన్లు వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలను ఓడించడం కోసం ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు.. అనేది తెలియదు కానీ… ఉపఎన్నికలు ముగిసి ఫలితాలు వస్తే.. కానీ ఎవరి వ్యూహాలు ఫలించాయో తెలుస్తుంది.

Advertisement