కుటుంబాన్ని బలిగొన్న కరోనా

Advertisement

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదలకు చెంది నరసయ్య ఈనెల 16న కరోనాతో మృతిచెందాడు. కరోనా వల్ల నరసయ్య మృతి చెందటంతో బంధువులు ఎవ్వరూ కూడా పలకరించడానికి రాలేదు. నరసయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇప్పుడు కుటుంబ పెద్ద మరణించడం, బంధువులు ఎవ్వరూ పలకరించడానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన నరసయ్య భార్య సునీత(50), కుమారుడు ఫణికుమార్ (25)‌, కుమార్తె అపర్ణ (23) గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.

రైల్వే బ్రిడ్జి పైనుంచి వీరు ముగ్గురూ గోదావరిలోకి దూకడంతో గల్లంతయ్యారు. గోదావరిలో వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలకు అంతరాయమేర్పడుతోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరోనా వచ్చిన వారే కాకుండా ఇలా కుటుంబ సభ్యులు కూడా చనిపోవడం బాధాకరం. కరోనా భారిన పడ్డ భాదితుల పట్ల గాని, వారి కుటుంబ సభ్యుల పట్ల వివక్ష చూపించవద్దని అధికారులు చెప్తున్నా ప్రజలు అర్ధం చేసుకోవడం లేదు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here