కరోనా తో మరో ఎమ్మెల్యే బలి

Advertisement

కరోనా దేశంలో శరవేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రెండు మిలియన్ల పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే రాజకీయనాయకులు, సినీప్రముఖులు అని తేడా లేకుండా అందరు ఈ మహమ్మరి బారిన పడ్డారు. అయితే తాజాగా ఓ ఎమ్మెల్యే కరోనా బారిన పడి మృత్యవాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సమరేష్ దాస్ సోమవారం కరోనాతో మరణించారు. అయితే ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఈగ్రా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సమరేష్ దాస్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు.

దీనితో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా తుదిశ్వాస విడిచారు. అయితే పశ్చిమ బెంగాల్ లో ఇప్పటికే ఒక ఎమ్మెల్యే కరోనా బారిన పడి మృతి చెందారు. ఇక సమరేష్ దాస్ కూడా చనిపోయే సరికి కరోనాతో మరణించిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది. ఎమ్మెల్యే సమరేష్ దాస్ మృతి తీరని లోటని, ఆయనకు సీఎం మమతాబెనర్జీ తో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here