Wedding Video : వ‌రుడికి ప్ర‌పోజ్ చేసేందుకు ఫ్యామిలీ అంద‌రితో డ్యాన్స్ చేసిన వ‌ధువు.. వీడియో చ‌క్క‌ర్లు

Wedding Video : పెళ్లి అంటే ఎంత స‌ర‌దా, సంతోషం ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో పెళ్లిళ్ల‌ను మ‌రింత గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేస్తూ ఈ వేడుక‌ల‌లో వ‌ధూ వ‌రులతో పాటు కుటుంబ స‌భ్యులు కూడా డ్యాన్స్‌లు చేయ‌డం మ‌నం గ‌మిస్తూనే ఉన్నాం. ఆ మ‌ధ్య తెలంగాణలో ఓ వధువు చేసిన డ్యాన్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది.

Wedding Video bride dance with family goes viral
Wedding Video bride dance with family goes viral

జగిత్యాల జిల్లా ధర్మారంకు చెందిన సాయి శ్రీయ వివాహం అశోక్‌తో వివాహం జ‌రిగిందిది. వరుడికి వధువు స్వాగతం పలుకుతూ ఓ పాటకు చిందులేసింది.పెళ్లి కొడుకు వచ్చిన వాహనం ఎదుట పెళ్లి కూతురు స్వయంగా పాట పాడి డ్యాన్స్ చేసింది. వధువు డ్యాన్స్‌ను కాసేపు నవ్వుతూ చూసిన వరుడు ఆ తర్వాత తను కూడా కాలు కదిపాడు.

వధువుతో కలిసి డాన్స్ చేసి ఆ తర్వాత ఆగిపోయాడు. ఆ వధువు మాత్రం దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఆ పాటకు డాన్స్ చేస్తూనే ఉంది. వదువు డాన్స్‌ను వరుడు తాపీగా నిలబడి ఎంజాయ్ చేయసాగాడు. చివర్లో బంధువులు, స్నేహితులు కూడా వధువుతో కలిసి డాన్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైర‌ల్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

తాజాగా ఓ వధువు త‌న పెళ్లిరోజును భలే ప్లాన్ చేసుకుంది.అన్ని అనుకున్నది అనుకున్నట్లుగా చేసి కాబోయే వాడితో పాటు నెటిజన్లు కూడా ఫిదా చేసింది. కత్రినా కైఫ్ పాటకు సూపర్బ్ గా డ్యాన్స్ చేస్తు వచ్చి పెళ్లి కొడుకుకు ఉంగరంతో ప్రపోజ్ చేసి..తెగ వైరల్ అయిపోతోంది.

గూర్గావ్‌కు చెందిన స‌బా క‌పూర్ అనే పెళ్లికూతురు అయ్యింది. పెళ్లికి ఎంట్రీ స‌మ‌యంలో తానే కాకుండా తన కుటుంబ సభ్య అంద‌రితో క‌లిసి క‌త్రినా కైఫ్‌, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా న‌టించిన బార్ బార్ దేఖో సినిమాలోని సా ఆస్‌మానోకో అనే పాట‌కు డ్యాన్స్ వేసి అద‌ర‌గొట్టింది. అంద‌రితో డ్యాన్స్ వేస్తూ వచ్చింది. అలా పెళ్లికొడుకు ద‌గ్గ‌ర‌కు చేరుకొని అత‌డికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేసింది. తన సహచరి స‌రికొత్త ఎంట్రీకి పెళ్లికొడుకు ఫిదా అయిపోయాడు. నెటిజ‌న్లు కూడా వావ్.. అంటున్నారు.