Ram Charan Watch Value : రామ్ చరణ్ పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎంతో తెలుసా.. ఆ డబ్బుతో ఇల్లు కొనేయొచ్చు..!

NQ Staff - June 25, 2023 / 11:12 AM IST

Ram Charan Watch Value : రామ్ చరణ్ పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎంతో తెలుసా.. ఆ డబ్బుతో ఇల్లు కొనేయొచ్చు..!

Ram Charan Watch Value : రామ్ చరణ్‌ ఇప్పుడు బడా ప్రాజెక్టుతో చాలా బిజీ అయిపోయాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కెరీర్ లో హైట్స్ కు వెళ్లిన చరణ్‌.. ఇప్పుడు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే పెండ్లి అయిన పదేండ్లకు చరణ్‌-ఉపాసన దంపతులకు పాప పుట్టింది.

దాంతో మెగా లిటిల్ ప్రిన్సెస్ వచ్చిందనే సంతోషంలో ఉంది మెగా ఫ్యామిలీ. అటు చిరంజీవి కూడా మనవరాలి కోసం ఆస్పత్రిలోనే రెండు రోజులు ఉన్నారు. మీడియాకు ఆమె వివరాలను మొత్తం తెలియజేశారు. ఇక మొన్న రామ్ చరణ్‌, ఉపాసన కూడా పాపతో మీడియా ముందుకు వచ్చారు.

Watch Worn By Ram Charan Goes Viral On Social Media

Watch Worn By Ram Charan Goes Viral On Social Media

అయితే ఇందులో రామ్ చరణ్‌ పెట్టుకున్న వాచ్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆయన పెట్టుకున్న వాచ్ ఖరీదు గురించి అంతా ఆరా తీస్తున్నారు. ఆయన వాచ్ ఖరీదు రూ.కోటీ 62 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫ్యాన్స్,, నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Watch Worn By Ram Charan Goes Viral On Social Media

Watch Worn By Ram Charan Goes Viral On Social Media

మాకే గనక ఆ డబ్బులు ఉంటే లగ్జరీ ఇల్లు కొనేవాళ్లం అంటూ తెలుపుతున్నారు. ఎంతైనా మెగా పవర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ చెబుతున్నారు కొందరు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us