Virat Kohli: క‌న్నీరు పెట్టుకున్న ఇషాన్ కిష‌న్‌.. బాధ‌ప‌డొద్దంటూ ఓదార్చిన కోహ్లీ

Virat Kohli: ప్ర‌స్తుతం ఐపీఎల్ ఫీవ‌ర్ న‌డుస్తుంది. నువ్వా నేనా అన్న‌ట్టు ఆటగాళ్లు పోటీ ప‌డుతున్నారు. కొంద‌రు చేతికొచ్చిన మ్యాచ్ చేజార‌డంతో క‌న్నీరు పెట్టుకుంటున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్‌ యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్ ఏడిచినంత ప‌ని చేశాడు. కోహ్లీ అత‌నిని ద‌గ్గ‌ర‌కు తీసుకొని ఓదార్చే ప్ర‌య‌త్న చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

2020 ఐపీఎల్‌ సీజన్‌లో ఇషాన్‌ కిషన్‌ 500 పరుగుల క్లబ్‌ను కూడా అందుకొని టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అయితే ఈసారి సీజన్‌లో మాత్రం ఇషాన్‌ వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. తాజాగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది పరుగులు మాత్రమే చేసి చహల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తన ఆటతీరుపై పెవిలియన్‌కు వెళ్లాకా చాలా బాధపడ్డాడు.

మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఇషాన్‌ని ద‌గ్గ‌ర‌కు తీసుకున్న విరాట్ కోహ్లీ ఓదారుస్తూ క్రీడా స్పూర్తిని చాటాడు. కోహ్లి ఇషాన్‌పై చేతులు వేసి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయగా.. అతను కన్నీటిని దిగమింగుకున్నాడు. వాస్తవానికి ఇషాన్‌ కిషన్‌తో పాటు మరో ముంబై ప్రధాన బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలు కూడా విఫలమవుతూనే ఉన్నారు. వీరి వైఫ‌ల్యం వ‌ల‌న ముంబై జ‌ట్టు దారుణంగా ఓడిపోతుంది.

ఇషాన్, సూర్య కుమార్ యాద‌వ్, హార్ధిక్ పాండ్యా .. టీ 20 ప్రపంచక్‌ప్‌కు టీమిండియా జట్టులో ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా వీరి ఫామ్‌పై ఆందోళన చెందుతున్న బీసీసీఐ టీమిండియా జట్టులో వేరే ఆటగాళ్లను(అయ్యర్‌, శాంసన్‌, మయాంక్‌ అగర్వాల్‌) తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇషాన్‌ కిషన్‌ తను టి20 జట్టులో స్థానం ఎక్కడ కోల్పోతానన్న భయంతోనే ఎమోషనల్‌ అయ్యాడా అని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. కాగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 55 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది.