వార్నీ… ఈ డెలివరీ గర్ల్ చూడండి.. ఆర్డర్ చేసిన ఫుడ్డును ఎలా కొట్టేసిందో?
Ajay G - November 5, 2020 / 07:31 PM IST

ఇది కరోనా కాలం కదా. ఇప్పుడు ఎవ్వరినీ ముట్టుకోవడాలు లేవు. దగ్గరికి వెళ్లి మాట్లాడటాలు లేవు. ఏదున్నా.. దూరం నుంచే మాట్లాడటం. ఏదైనా ఆర్డర్ చేసినా కూడా దూరం దూరంగా ఉండటం… డోర్ ముందే పెట్టి.. దాని ఫోటో తీసి దాన్ని కస్టమర్ కు పంపించి వెళ్లిపోవడం. వాళ్లు వెళ్లిపోయాక బయటికెళ్లి కస్టమర్లు వాళ్ల ఆర్డర్ ను తీసుకుంటారు.

watch how delivery woman steals ordered food
అయితే ఇదే ఫుడ్ డెలివరీ చేసే వాళ్లకు అందిన అవకాశం అవుతోంది. దాన్ని కొందరు అలుసుగా తీసుకొని.. ఫుడ్డు డెలివరీ చేసినట్టే చేసి.. డోర్ ముందు పెట్టి ఫోటో తీసి కస్టమర్లకు పంపించి మళ్లీ దాన్నే తీసుకొని వెళ్లిపోతున్నారు. అందరు కాదు కానీ కొందరు మాత్రం ఇలాంటి పనులు చేసి అడ్డంగా దొరికిపోతున్నారు.
అంత బాగానే ఉంటుంది కానీ.. ఇంటి ముందు సీసీ కెమెరా ఉంటుంది అనే విషయాన్ని మరిచిపోతున్నట్టున్నారు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
యూఎస్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ఫుడ్ డెలివరీ సంస్థకు చెందిన డెలివరీ గర్ల్.. కస్టమర్ ఇంటికి వచ్చి డోర్ ముందు ఫుడ్డు పెట్టేసి.. ఫోటో తీసి కస్టమర్ కు పంపించి.. వెంటనే ఆ ఫుడ్ ప్యాకెట్ ను అందుకొని అక్కడి నుంచి ఉడాయించింది. ఆ వీడియో.. ఫుడ్ డెలివరీ సంస్థ వరకు వెళ్లడంతో ఆ డెలివరీ గర్ల్ పై చర్యలు తీసుకున్నట్టు ఆ సంస్థ తెలిపింది. మొత్తానికి ఆ గర్ల్ చేసిన స్మార్ట్ దొంగతనం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
https://www.youtube.com/watch?v=UEyeMbly8cc&feature=emb_title