Washington Sundar : భార‌త క్రికెట‌ర్‌కి క‌రోనా.. సౌతాఫ్రికా టూర్‌కి దూర‌మైన‌ట్టేనా..!

Washington Sundar : కరోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు చాప‌కింద నీరులా వ్యాపిస్తుంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ప్రతి రోజు లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఆ ప్రభావం భారత క్రికెట్ జట్టుపైనా పడింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు ఎంపికైనా టీమిండియా క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

Washington Sundar tests positive for covid 19
Washington Sundar tests positive for covid 19

అతడికి కరోనా సోకినా ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవు. ప్రస్తుతం సుందర్‌ హోం ఐసోలేషన్‌ లో ఉన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ తన సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. అయితే ఈ మధ్య కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలిన కోరాడు. ఇక క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కు కరోనా సోకడంతో.. సౌతాఫ్రికా జట్టుతో జరిగే… వన్డే సిరీస్‌ కు దూరం అయ్యే అవకాశం ఉంది. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో మరొకరికి చాన్స్‌ దక్కనుంది.

సఫారీ వన్డే సిరీస్‌కి ఎంపికైన భారత క్రికెట్ సభ్యులందరూ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్నారు. అక్కడి నుంచి ముంబై చేరుకుని, ప్రత్యేక ఛార్టెట్ ఫ్లైట్‌లో బుధవారం ఉదయం సౌతాఫ్రికా చేరుకోవాల్సి ఉంది. అయితే వాషింగ్టన్ సుందర్‌కి చేసిన కరోనా పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఇంగ్లాండ్‌ టూర్‌లో కౌంటీ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన వాషింగ్టన్ సుందర్, దాదాపు నాలుగు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని తమిళనాడు తరుపున విజయ్ హాజారే ట్రోఫీ 2021లో పాల్గొన్నాడు సుందర్. విజయ్ హాజరే ట్రోఫీలో వాషింగ్టన్ సుందర్ కనబర్చిన పర్ఫామెన్స్ కారణంగా అతనికి సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేశారు బీసీసీఐ సెలక్టర్లు. అయితే అతను ఇప్పుడు కరోనా పాజిటివ్‌గా తేలడంతో వాషింగ్టన్ సుందర్, సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లడం అనుమానంగానే మారింది…

వాషింగ్టన్ సుందర్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్ వంటి మరో ఇద్దరు స్పిన్నర్లకు కూడా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అవకాశం దక్కింది. అయితే అశ్విన్, చాహాల్‌లతో పోలిస్తే వాషింగ్టన్ సుందర్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టుకి బ్యాటుతోనూ ఉపయోగపడతాడు..