ఆర్మీ ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య

Advertisement

ఉమ్మడి వరంగల్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తనకు ఆర్మీ ఉద్యోగం రాలేదని తల్లి దండ్రుల ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన వేమూరి రవీందర్ కుమారుడు శివసాయి (20) ఆర్మీ లో ఉద్యోగం సంపాదించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. అయితే ఇప్పటికే ఆ ఉద్యోగం కోసం నాలుగు సార్లు ప్రయత్నం చేసాడు. కానీ శివసాయి కి ఉద్యోగం రాకపోగా, తన స్నేహితులు కొందరు ఉద్యోగాలు పొందారు.

ఇక దీనితో మనస్తాపంకి చెందిన శివసాయి, కొన్ని రోజుల నుండి కుటుంబ సభ్యులతో సరిగ్గా ఉండడం లేదు. అయితే తల్లి దండ్రులతో గొడవపడి రైలు పట్టాల వెంబడి నడుచుకుంటూ వెళ్ళాడు. ఇక అతన్ని బుజ్జగించి తీసుకొద్దాం అని వెనకాలే వెళ్లారు తల్లి దండ్రులు. రాంపూర్‌ వద్ద సికింద్రాబాద్‌ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న ఒక రైలుకు ఎదురుగా వెళ్లి శివసాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనితో అతడి తల్లిదండ్రులు ఒక్క సరిగా షాక్‌లోకి వెళ్లిపోయారు. ఇక అనంతరం రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. తరువాత శివసాయి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here