Waltair Veerayya And Varisu: అక్కడ వారిసు, ఇక్కడ వాల్తేరు.. సంక్రాంతి సినిమాల జోరు
NQ Staff - January 19, 2023 / 08:34 PM IST

Waltair Veerayya And Varisu : మొన్న సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. మరో వైపు తమిళనాట అజిత్ నటించిన తునివ్వు మరియు విజయ నటించిన వారిసు చిత్రాలు విడుదలయ్యాయి.
వీర సింహారెడ్డి సినిమా కలెక్షన్స్ వేటలో కాస్త వెనుక పడ్డట్లుగా కనిపిస్తోంది. అదేవిధంగా అజిత్ నటించిన తునివ్వు సినిమా కూడా తమిళనాట వసూళ్ల విషయంలో వెనుకబడింది. తెలుగు రాష్ట్రాల్లో వాల్తేరు వీరయ్య మరియు తమిళనాడులో వారిసు సినిమాల జోరు కంటిన్యూ అవుతుంది.
రెండు సినిమాలు కూడా ఇప్పటికే రూ. 150 కోట్ల కలెక్షన్స్ మార్క్ క్రాస్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఓవర్సీస్ లో కూడా ఈ రెండు సినిమాల ప్రభంజనం కనిపిస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా యొక్క అమెరికా కలెక్షన్స్ ఇప్పటికే రెండు మిలియన్ డాలర్లను క్రాస్ చేశాయి.
మొత్తానికి సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరియు వారిసు సినిమా తమిళనాడులో ప్రభంజనం అన్నట్లుగా కలెక్షన్స్ నమోదు చేస్తున్నాయి. ఈ రెండు సినిమాలు ఆయా హీరోలకు కెరియర్ బెస్ట్ చిత్రాల్లో చోటు దక్కించుకునే అవకాశం ఉందని బాక్సాఫీస్ వారు మాట్లాడుకుంటున్నారు.