టిక్ టాక్ ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న వాల్ మార్ట్
Admin - August 28, 2020 / 10:22 AM IST

టిక్ టాక్ ఎంత వేగంగా తన యూసర్ బేస్ ను పెంచుకుందో అంతే వేగంగా కష్టాలను ఎదుర్కొంటుంది. దేశ భద్రతా పరమైన కారణాల వల్ల టిక్ టాక్ ను ఇండియా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఆలాగే అమెరికా కూడా టిక్ టాక్ ను బ్యాన్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అయితే బ్యాన్ చేయకుండా ఉండాలంటే టిక్ టాక్ ను అమెరికా సంస్థకు విక్రయించాలని ట్రంప్ కండిషన్ పెట్టిన నేపథ్యంలో టిక్ టాక్ ను కొనుగోలు చేయడానికి అమెరికా సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
అయితే ఇప్పుడు తాజాగా వాల్ మార్ట్ ఈ జాబితాలో చేరింది. టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాల్ని మైక్రోసాఫ్ట్‌తో కలిసి కొనుగోలు చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నామని వాల్‌మార్ట్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, టిక్‌టాక్‌తో చేసుకోనున్న ఈ ఒప్పందం తమ అడ్వర్టైజింగ్ వ్యాపారాన్ని మరింత విస్తృతపరిచేందుకు దోహదం చేస్తుందని తెలిపింది. అయితే ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ గాని టిక్ టాక్ గాని స్పందించలేదు.