Wall Posters Criticizing Congress : కాంగ్రెస్ స్కీములను తెలంగాణ పథకాలతో పోలుస్తూ వాల్ పోస్టర్లు..!
NQ Staff - September 17, 2023 / 11:00 AM IST

Wall Posters Criticizing Congress :
హైదరాబాద్ లో ఇప్పుడు సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే లాంటి బడా నేతలు చేరుకున్నారు. నేడు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను విమర్శిస్తూ హైదరాబాద్ లో వాల్ పోస్టర్లు వెలిశాయి.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో స్కీములను, తెలంగాణ స్కీములను పోలుస్తూ ఈ పోస్టర్లలో ప్రశ్నలు ఉన్నాయి. కరప్ట్ కాంగ్రెస్-కరెక్ట్ బీఆర్ ఎస్ అంటూ ఈ వాల్ పోస్టర్లు ఉన్నాయి. దళితబంధు, రైతు బంధు, రైతు బీమా, వృద్ధులు, వికలాంగుల పెన్షన్ల గురించి వివరిస్తూ పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన చత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్ లో దళితులకు ఆర్థిక సాయం సున్నా.

Wall Posters Criticizing Congress
అదే తెలంగాణలో దళిత బంధు కింద రూ.10 లక్షలు. ఇక వికలాంగుల పెన్షన్ చత్తీస్ ఘడ్ లో 500, హిమాచల్ ప్రదేశ్ 1300, కర్నాటక 1100, రాజస్థాన్ 1,250 మాత్రమే ఉంది. కానీ తెలంగాణలో మాత్రం రూ.4116గా ఉంది. దాంతో పాటు వృద్ధుల పెన్షన్ చత్తీస్ ఘడ్ 500, హిమాచల్ ప్రదేశ్ 750-1250, కర్నాటక 1000, రాజస్థాన్ 1000-1250 గా ఉంది. కానీ తెలంగాణలో మాత్రం రూ.2016గా ఉంది.

Wall Posters Criticizing Congress
రైతులకు బీమా కింద కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏమీ లేదు. కానీ తెలంగాణలో రూ.5 లక్షలు ఇస్తున్నాం. రైతుబంధు కింత తెలంగాణలో ఎకరానికి రూ.10000వేలు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏమీ లేదు. రైతులకు ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన చత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్ లో లేదు. కానీ తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్ అంటూ ఈ వాల్ పోస్టర్లలో ఉంది.