Wall Clocks : విడ్డూరం : ఆ గుడిలో గడియారాలను ముడుపులుగా కడుతున్నారు
NQ Staff - January 23, 2023 / 09:59 PM IST

Wall Clocks : దేవుడి వద్దకు వెళ్ళిన భక్తులు అక్కడి చెట్టుకు ముడుపులు కట్టడం, పిల్లల కోసం ఊయలలు కట్టడం ఇంకా రకరకాలుగా చేస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లా లో అన్హెల్ రోడ్డు పక్కన సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయం ఉంది.
ఆ ఆలయం ముందు పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. స్థానికులు పెద్ద ఎత్తైన ఆ మర్రి చెట్టు కొమ్మలకు గోడ గడియారాలు కడుతూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా ఆ బాబాని స్థానికులు పూజిస్తూ ఉంటారు.
కోరిన కోరికలు తీరిన వారు వచ్చి బాబా గుడిలో గడియారాలను చెట్టుకు కట్టేసి వెళతారు. ప్రస్తుతం ఆ చెట్టుకు దాదాపుగా 2000 గడియారాలు ఉంటాయి. గతంలో ఒక భక్తుడు తమ కోరిన కోరిక తీరితే తమ ఇంట్లోనే అత్యంత ఖరీదైన గడియారాన్ని ముడుపుగా ఇస్తానంటూ మొక్కుకున్నాడు.
ఆయన కోరిన కోరిక తీరడంతో గడియారాన్ని ముడుపుగా ఇవ్వడం జరిగిందట. అప్పటి నుంచి కూడా ఆయన కుటుంబీకులు మరియు ఆయన చుట్టు పక్కల వారు ఆలయంలోని మర్రి చెట్టుకు గోడ గడియారాలను ఇవ్వడం జరుగుతుంది.
గోడ గడియారాలు ఇవ్వడం చాలా విడ్డూరంగా ఉంది కదా.. మూఢ నమ్మకం అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఎవరి విశ్వాసం వారిది అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.