Remuneration Of Project K Actors : ప్రాజెక్ట్ కే నటీనటుల రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాంకే..!
NQ Staff - June 27, 2023 / 12:05 PM IST

Remuneration Of Project K Actors : ప్రభాస్ హీరోగా వస్తున్న ప్రాజెక్ట్ కే విషయంలో రోజురోజుకూ హైప్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని కొత్త రకమైన కథతో ఈ సినిమా వస్తున్నట్టు ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. దీన్ని వైజయంతి మూవీస్ వారు ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ మూవీని ఏకంగా పాన్ వరల్డ్ సినిమాగా తీస్తున్నారని తెలుస్తోంది.
ఈ మూవీని సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తీస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఈ మూవీ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ షూటింగ్ జులై నుంచి రెగ్యులర్ గా జరగబోతోంది.
కాగా ఈ మూవీ కోసం నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఈ మూవీ కోసం ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్లు తీసుకుంటున్నాడంట. ఇక దీపికా పదుకునే రూ.10 కోట్లు తీసుకుంది. అలాగే కమల్ హాసన్ తన పాత్ర కోసం ఏకంగా రూ.20 కోట్లు తీసుకున్నారు.
అమితాబ్ బచ్చన్ రూ.15 కోట్లు, హీరోయిన్ దిశా పఠానీ రూ.5 కోట్లు తీసుకుంటున్నారు. కేవలం వీరి రెమ్యునరేషన్ కోసమే ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే ఆశర్యపోవాల్సిందే. ఇక సినిమా బడ్జెట్ ను మరింత పెంచే అవకాశాలు కూడా మెండుగానే కనిపిస్తున్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.