Volunteers Angry On Pawan Kalyan Comments : ఎద్దులా ఎదిగావ్.. నీకు బుద్ధి లేదా.. పవన్ మీద వాలంటీర్ల ఆగ్రహం..!

NQ Staff - July 10, 2023 / 01:55 PM IST

Volunteers Angry On Pawan Kalyan Comments : ఎద్దులా ఎదిగావ్.. నీకు బుద్ధి లేదా.. పవన్ మీద వాలంటీర్ల ఆగ్రహం..!

Volunteers Angry On Pawan Kalyan Comments :

పవన్ కల్యాణ్‌ వాలంటీర్ల మీద చేసిన కామెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. లక్షల మంది వాలంటీర్ల పోస్టులతో ఉపాధి పొందుతున్నారు. అలాంటి వ్యవస్థ గురించి ఆయన చేసిన కామెంట్లతో వారందరి దృష్టిలో ఆయన మీద వ్యతిరేకత భావం ఏర్పడింది. ఇప్పుడు వాలంటీర్లు ఆయన మీద దుమ్మెత్తి పోస్తున్నారు.

కొందరు అయితే.. ఎద్దులా ఎదిగావ్.. నీకు ఇంత కూడా బుద్ధి లేదు. వారాహి బండి మీద ఎక్కి ఊగిపోతూ ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు తెలియట్లేదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రుజువు లేకుండా నోటికి వచ్చినట్టు ఎలా మాట్లాడుతావ్ అంటూ వాపోతున్నారు. పవన్ కల్యాణ్‌ అనే మాటలు అసలు ఆధారమే ఉండదు.

నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కరెక్ట్ కాదని అంటున్నారు. కోవిడ్ సమయంలో తాము ఎంతో మందికి సేవలు చేశామని.. చనిపోయిన వారికి బంధువులు కూడా రాకపోతే తామే అన్నీ చూసుకున్నామని.. అలాంటిది తమ మీద ఎలా మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కోవిడ్ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడామని.. ఎవరికీ అన్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాము చేస్తున్న సేవలను ఇతర రాష్ట్రాలు కూడా గుర్తించి ఇక్కడకు వచ్చి అధ్యయనం చేస్తున్నారని గుర్తు చేశారు వాలంటీర్లు. ప్రతి ఇంటికి వెళ్లి పొద్దు పొడవక ముందే సంక్షేమ పథకాలు వారి గుమ్మం ముందు ఉంచుతున్నామని వివరించారు వాలంటీర్లు. అలాంటిది తాము ఇంటింటికి వెళ్లి అమ్మాయిలు, వితంతువుల లెక్కలు తీసి వేరేవాళ్లకు ఎందుకు పంపిస్తామని ప్రశ్నిస్తున్నారు.

మేం అలా ఎవరికీ పంపలేదు.. మా వల్ల ఎవరూ ట్రాప్ కాలేదు దమ్ముంటే నిరూపించు అంటూ అడుగుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థలో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. అలాంటి మహిళలను ఇప్పుడు నువ్వు అవమానించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు వాలంటీర్లు.

Volunteers Angry On Pawan Kalyan Comments

Volunteers Angry On Pawan Kalyan Comments

చంద్రబాబు కూడా గతంతో మమ్మల్ని విమర్శించారు. కానీ ఇప్పుడు ఆయన మారిపోయారు. ఆయన అధికారంలోకి వస్తే మా వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నారు. ఆయన్ను చూసి అయినా నీకు మా విలువ ఏంటో తెలియలేదా పవన్ అంటూ అడుగుతున్నారు. నువ్వు చేసే స్టేట్మెంట్లకు మళ్ళీ కేంద్ర ఇంటలిజెన్స్ పేరు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. కేంద్ర సంస్థలు నీకు ఎందుకు సైట్ పర్మిషన్ ఇస్తాయి.. నువ్వు తలా తోక లేని ఆరోపణలతో మమ్మల్ని టార్గెట్ చేస్తే నీకు 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని వార్నింగ్ ఇస్తున్నారు వాలంటీర్లు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us