Nora fatehi :మ‌ట్టిలో మాణిక్యాలు..బాహుబ‌లి బ్యూటీని అట్రాక్ట్ చేసిన ముగ్గురు చిన్నారులు

Nora fatehi: బాహుబ‌లి సినిమాలో మ‌నోహ‌రి పాట‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మ నోరా ఫ‌తేహి. తెలుగులోని చాలా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ మ‌నోహ‌రి పాట‌తొ మెప్పించింది. అయితే ఈ అమ్మ‌డిని పూరీ గుడిసెల్లో ఉండే ముగ్గురు చిన్నారు అట్రాక్ట్ చేశారు. వారి ప‌ర్‌ఫార్మెన్స్ తెగ ఫిదా అయింది.

nora fatehi in bahabali
nora fatehi in bahabali

ముగ్గురు చిన్నారులు ఒక పూరి గుడిసె ముందు ఓ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోని చూసి ఇంప్రెస్ అయిన నోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ముగ్గురు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్న వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ముగ్గురు అమ్మాయిలు.. బాలీవుడ్ పాటలకు, పంజాబీ పాటలను చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు.

Nora fatehi shared in her social media
Nora fatehi shared in her social media

బాలీవుడ్ లోని సత్యమేవ జయతే 2లోని ‘కుసు కుసు’ పాటకు ముగ్గురు అమ్మాయిలు డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అమ్మాయిల ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఒరిజినల్ సాంగ్‌లో నటించిన నోరా ఫతేహి దృష్టిని కూడా ఆకర్షించింది. నోరా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఆ ముగ్గురు అమ్మాయి డ్యాన్స్ వీడియో షేర్ చేసింది.

Nora fatehi
Nora fatehi

నిజానికి ఒరిజినల్ సాంగ్‌లో పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ‘నోరా ఫతేహిని కూడా ఈ అమ్మాయిలు తమ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఆకర్షించారు. నోరా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీరి డ్యాన్స్ వీడియోని షేర్ చెయ్యగా.. వీరి డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఈ ముగ్గురు అమ్మాయిలు డ్యాన్స్ చేసే ప్రతి వీడియో కూడా మురికివాడ కావటం విశేషం. వీళ్ల డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ ‘ఫుల్ టాలెంటెడ్ గర్ల్స్’ అని కాంప్లిమెంట్ అని చెప్పకుండా ఉండలేరు. ఈ వీడియో ముందుగా ‘డాన్స్ దీవానే సీజన్ 3’ కంటెస్టెంట్ ఉదయ్ సింగ్ షేర్ చేశాడు. ఈ ఒరిజినల్ క్లిప్‌ను నోరా ఫతేహి రీపోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది.