VIVA HARSHA: ఆసుపత్రి పాలైన వైవా హర్ష.. ఉలిక్కిపడ్డ అభిమానులు..!
Samsthi 2210 - February 19, 2021 / 11:49 AM IST

VIVA HARSHA యూట్యూబ్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి కామెడీ చేస్తూ అలరించిన వైవా హర్ష మెల్లమెల్లగా తన కెరీర్‌ను బిల్డప్ చేసుకున్నాడు. హోస్ట్‌గాను, నటుడిగాను అదరగొడుతున్నాడు. సినిమాలు, షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ ఇలా ఒకటేంటి దొరికిన ఛాన్స్‌లన్నింటిని మంచిగా ఉపయోగించుకుంటూ దూసుకుపోతున్నాడు. వైవా అనే షార్ట్ ఫిలింతో వైవా హర్షగా మారిన ఇతను అనేక సెలబ్రిటీలతో సైతం మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు. దీంతో హర్షకు ఆఫర్స్ అడపాదడపా వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇతను సుమంత్ నటించిన అనగనగా ఓ రౌడీ’ సినిమా షూటింగ్‌లో చేస్తున్నాడు.
హర్ష కొద్ది రోజుల క్రితం అక్షర అనే యువతితో నిశ్చితార్ధం జరుపుకున్నాడు. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫుల్ వైరల్ అయ్యాయి. ఏడాదిలో గుడ్ న్యూస్ చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. మరి కొద్ది రోజులలో పెళ్ళి శుభవార్త చెప్తాడని అందరు ఎదురు చూస్తున్న క్రమంలో వైవా హర్ష తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చాయి. బైక్ రైడింగ్‌లకు సంబంధించిన ఫోటోలు, గాయాలతో ఆసుపత్రి పాలైన ఫొటోలను వైవా హర్ష షేర్ చేయగా, ఇవి తెగ వైరల్ అయ్యాయి. హర్షని అలా చూసే సరికి ప్రతి ఒక్కరు డైలామాలో పడ్డారు.కాని అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
సుమంత్ హీరోగావస్తోన్న అనగనగా ఓ రౌడీ సినిమా షూటింగ్ కోసం హర్ష ఈ గెటప్‌లోకి మారాడు. అవి నిజమైన దెబ్బలు కావని, సినిమా షూటింగ్ కోసం ఈ గెటప్‌లోకి మారాడని నిదానంగా తెలుసుకున్న నెటిజన్స్ కూల్ అయ్యారు. ఏదేమైన హర్ష కొద్ది సేపు మాత్రం అందరిని తెగ టెన్షన్ పెట్టాడు. రీసెంట్‌గా మనోడు సామ్ జామ్ అనే కార్యక్రమంతోను సందడి చేసిన విషయం తెలిసిందే. ఆహా కోసం సమంత సామ్ జామ్ అనే షోను హోస్ట్ చేయగా ఇందులో హర్ష కో హోస్ట్‌గా కనిపించి సందడి చేశాడు. పలువరు సెలబ్రిటీలను ఫన్నీ ప్రశ్నలు అడుగుతూ తెగ నవ్వించేశాడు.
View this post on Instagram