VIJAY DEVARAKONDA:విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో విరోధం.. స్పందించిన యువ హీరో

టాలీవుడ్ యంగ్ హీరోస్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విశ్వ‌క్ సేన్ మ‌ధ్య విరోధ‌ము న‌డుస్తుంద‌ని రెండేళ్ల నుండి జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. దీనిపై ఇటు విజ‌య్ కాని అటు విశ్వ‌క్ కాని ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. తాజాగా ఓ షోకు హాజ‌రైన విశ్వ‌క్ అస‌లు విష‌యం ఏంట‌నేది వివ‌రించి అనుమానాల‌కు తెర‌దించాడు. ఫలక్‌నుమా దాస్ ప్రీ రిలీజ్ వేడుకలో ఇప్పటికే ఒకడ్ని లేపినం.. మళ్లీ ఈన్నెక్కడ లేపాల్రా నాయనా అనుకుంటున్నారేమో.. నన్నెవడూ లేపాల్సిన అవసరం లేదు.. నన్ను నేనే లేపుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు విశ్వక్ సేన్.

విశ్వ‌క్ సేన్‌ చేసిన ఈ కామెంట్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఉద్దేశించి అని జోరుగా ప్ర‌చారం జ‌రిగిది. అభిమానుల మ‌ధ్య కూడా దీనిపై చాలా చ‌ర్చ న‌డిచింది. ఎట్ట‌కేల‌కు రెండేళ్ల త‌ర్వాత విశ్వ‌క్ సేన్ అస‌లు విష‌యం ఏంట‌నేది తెలియ‌జెప్పి అనుమానాల‌కు ముగింపు ప‌లికాడు. ఆ రోజు తాను విజయ్‌ను ఏమనలేదని.. కావలనే కొందరు తమ మధ్య పుల్ల పెట్టారని చెప్పుకొచ్చారు. తమ ఇద్దరి మధ్య స్నేహం, శత్రుత్వం రెండూ లేవని క్లారిటీ ఇచ్చారు. ఫ‌ల‌క్‌నుమా దాస్ టైమ్‌లో ఓ నిర్మాత వీడిని తొక్కండ్రా అన్నాడని, అవి నా మ‌న‌సుకు బాగా కుచ్చుకోవ‌డంతో అలా మాట్లాడానే త‌ప్ప ఎవ‌రిని ఉద్దేశించి కాద‌ని అన్నాడు విశ్వక్.

నేను మాట్లాడిన మాట‌ల‌ను కొన్ని మీడియా సంస్థ‌లు మార్చి రాసాయి. కాస్త మ‌సాలా ద‌ట్టించి ఈ ఇష్యూని హైలైట్ చేయ‌డంతో దానిపై వివాదం చెలరేగింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను నేను ఒక్క మాట కూడా అన‌లేదు. ఇప్పటికీ అదే మాట చెప్తున్నాను, న‌న్నెవ‌రు లేపాల్సిన అవసరం లేదు.. నన్ను నేను లేపుకుంటానంటూ మళ్లీ కామెంట్ చేసారు విశ్వక్. అవ‌స‌ర‌మైతే నా సినిమాకు నేనే ద‌ర్శ‌క‌త్వం చేసుకుంటానంటూ బోల్డ్‌గా మాట్లాడాడు విశ్వక్ సేన్. వెళ్లిపోమాకే లాంటి చిన్న సినిమాతో పరిచయం అయిన ఈ కుర్రాడు.. ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్ సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న విశ్వ‌క్ ప్ర‌స్తుతం పాగ‌ల్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.

Advertisement