సోషల్ మీడియా చాలా విస్తృతం అయింది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు యూ ట్యూబ్ ద్వారా కొందరు డబ్బులు ఆర్జించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని విలువలు మరచిపోతూ ప్రవర్తిస్తున్నారు. సెలబ్రిటీలని టార్గెట్ చేస్తూ వారిపై తప్పుడు రాతలు రాస్తూ మనీ క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్‌లలో అయితే హెడ్డింగ్ ఒకటి ఉంటే, లోపల మేటర్ ఒకటి ఉంటుంది. కొందరు వీటిని చాలా లైట్ తీసుకుంటున్నప్పటికీ మరి కొందరు మాత్రం సీరియస్‌గా స్పందిస్తున్నారు. తాజాగా పాగల్ హీరో విశ్వక్ సేన్ తప్పుడు థంబ్ నెయిల్ పెట్టిన యూ ట్యూబ్ ఛానెల్ వారికి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చాడు.
వెల్లిపోమాకే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విశ్వక్.. ఈ నగరానికి ఏమైంది చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫలక్‌నుమా దాస్, హిట్ సినిమాలతో విశ్వక్ సేన్ రేంజ్ మారింది. ప్రస్తుతం పాగల్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే రీసెంట్గా నందిత శ్వేత హీరోయిన్గా రూపొందుతున్న అక్షర మూవీ ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ సమయంలో నందిత మాట్లాడుతూ.. విశ్వక్ ఈ వేడుకకు వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఆయనకు కృతజ్ఞతలు అని పేర్కొంది. దీనిని మార్చి .. విశ్వక్.. నీకు ఏం కావాలన్నా సిగ్గులేకుండా అడుగు ఇచ్చేస్తా’ అని థంబ్ నెయిల్ పెట్టింది ఓ యూట్యూబ్ ఛానెల్ యాజమాన్యం.
ఇది చూసి చిర్రెత్తిన విశ్వక్ సేన్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అసలు అక్కడ ఆమె మాట్లాడింది ఏంటి..? మీరు పెట్టిన థంబ్‌నైల్ ఏంటి..? కొంచెం కూడా విలువలు లేవా..? ఇలా రాసేముందు మీ ఇంట్లో అక్కా చెల్లెలు గురించి ఆలోచిస్తే ఇలా పెట్టరు. పెట్టినోడికి చెపుతున్నా, 24 గంటలలో సారీ చెప్పి మరో వీడియో విడుదల చేయకపోతే ఎక్కడున్నా నిన్న పుట్టుకొని మరీ పెట్టిస్తా. సినిమా షూటింగ్ ఉన్నా, ఇతర పనులు ఉన్నా నిన్ను పట్టుకుంటా అంటూ విశ్వక్ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. దీనిపై సదరు యూ ట్యూబ్ ఛానెల్ స్పందిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది . విశ్వక్ నటిస్తున్న పాగల్ చిత్రంతో నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న చిత్రం విడుదల కానుంది.