Vishnu Priya : తల్లి మరణంతో సంచలన నిర్ణయం తీసుకున్న విష్ణుప్రియ.. ఇక కెరీర్ అంతేనా..!
NQ Staff - January 30, 2023 / 01:01 PM IST

Vishnu Priya : విష్ణుప్రియ బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం. ఆమె పోవే పోరా షోతో బాగా ఫేమస్ అయిపోయింది. అంతకు ముందు ఆమె కొన్ని వెబ్ సిరీస్ లలో నటించినా పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. కానీ ఎప్పుడైతే బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి పాపులారిటీ సొంతం అయిపోయింది. ముఖ్యంగా సుధీర్ తో కలిసి చేసిన ట్రాక్ ఆమెకు బాగా కలిసి వచ్చింది.
వీరిద్దరి జోడీకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక అలా వచ్చిన క్రేజ్ తోనే ఆమె ఇతర షోలలో కూడా కనిపించింది. ఈ క్రమంలోనే ఆమెకు పెద్ద షాక్ ఇస్తూ పోవేపోరా షోను ఆపేశారు. కానీ ఆమె మాత్రం నిరుత్సాహ పడకుండా సినిమాల్లో అవకాశాలను వెతుక్కుంది. సినిమాల్లో లిప్ లాక్‌లు, బెడ్ సీన్లు చేయడానికి కూడా అస్సలు వెనకాడలేదు.
నీ పేరు నిలబెడుతా..
ఇలా కెరీర్ సాగుతున్న క్రమంలోనే ఆమె జీవితంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి రీసెంట్ గా అనారోగ్యంతో కన్ను మూశారు. ఈ క్రమంలోనే ఆమె సోషల మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టింది. నా చివరి శ్వాస ఉండే వరకు నీ పేరు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాను అమ్మా అంటూ తెలిపింది.
అయితే తల్లిపోయిన బాధలో ఉన్న విష్ణుప్రియ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులు షూటింగులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందంట. తన తల్లి పోయిన బాధ నుంచి బయటకు వచ్చే వరకు తాను సినిమాలకుదూరంగా ఉండాలని నిర్ణయించుకుది. ఇన్ని రోజులు ఎక్కడైనా యాంకరింగ్ ఛాన్స్ వస్తే చేయాలని భావించిన ఆమె.. ఇప్పుడు మాత్రం షూటింగులు వద్దని అనుకుంటోంది.