Vishnu Priya: బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు తన హాట్‌నెస్‌తో ఎంతగా అదరగొడుతుందో మనందరికి తెలిసిందే. గ్లామర్ ట్రీట్ అందిస్తూ కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది. ప్రస్తుతం యాంకర్‌గా ఒక్క షో కూడా లేకపోవడంతో నటిగా ఫోకస్ పెట్టింది. వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ఫిల్మ్ ల కోసం ట్రై చేస్తుంది. ఆ మధ్య `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రంలోనూ కాసేపు మెరిసింది. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ ఆమెని వరించడం లేదు.

మేకర్స్ దృష్టిలో పడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది విష్ణుప్రియా. నిత్యం తన హాట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లని అలరిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ ఏర్పడింది. విష్ణు ప్రియ వీడియో షేర్ చేసింది అంటే అది హల్‌చల్ చేయాల్సిందే.

విష్ణు ప్రియ నిజానికి మంచి డాన్సర్ అనే చెప్పాలి. అందులో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను అలరించడంలో ఈ బ్యూటీ స్టైలే వేరు. గతంలో ఈటీవీ ప్రసారమైన‘సరైనోళ్లు’, దసరా బుల్లోడు, తారా జువ్వాలు వంటి ఈవెంట్స్ లలో ఈ అందాల యాంకర్ గ్లామర్ స్టెప్పులకు అందరూ షాక్ అయ్యారు. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీలో నిర్వహించిన ఓ ఈవెంట్ లో ప్రపంచాన్ని షేక్ చేసిన ‘ఊ అంటావా.. మావ’ సాంగ్ కు సమంతను మించిపోయి ఆడింది.
- Advertisement -

అదే అవుట్ ఫిట్స్ లో అందాలు ఆరబోసింది. ఇప్పటికీ ఆ డాన్స్ ట్రెండ్ అవుతూనే ఉంటోంది. ఇక తాజాగా విష్ణు ప్రియ వీకెండ్ మస్తీ అందించింది. ట్రెడిషనల్ వేర్ లో ఈ ముద్దుగుమ్మ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘గురు’చిత్రంలోని ఓ మిలోడీ బిట్ కు చక్కగా డాన్స్ చేసింది. ఓ పక్క గ్లామర్ విందు చేస్తూనే మరోపక్క మయూరిలా డాన్స్ చేసి ఆకట్టుకుంది.

ఈ వీడియోకి నెటిజన్స్ ఫిదా కాగా, లైక్ లు, కామెంట్లతో విష్ణు ప్రియా డాన్స్ కు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు తన డాన్స్ ను రీల్ ను షేర్ చేస్తూ బుల్లితెర బ్యూటీని మరింత పాపులర్ చేస్తున్నారు.