Vishnu Priya : శోభనం కావాలంటూ బోల్డ్ గా మాట్లాడిన విష్ణుప్రియ.. అమ్మడికి తొందరెక్కువే..!

NQ Staff - May 24, 2023 / 02:01 PM IST

Vishnu Priya : శోభనం కావాలంటూ బోల్డ్ గా మాట్లాడిన విష్ణుప్రియ.. అమ్మడికి తొందరెక్కువే..!

Vishnu Priya  : యాంకర్ విష్ణుప్రియ అప్పుడప్పుడు నోరు జారుతోంది. ఆమె చేస్తున్న కామెంట్లు కొన్ని సార్లు కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఆమె చేసిన పని మళ్లీ నవ్వుల పాలు చేసింది. సుమ హోస్ట్ గా చేస్తున్న సుమ అడ్డా ప్రోగ్రామ్ కు తాజాగా ధన్ రాజ్, విష్ణుప్రియ, బలగం వేణు, చమ్మక్ చంద్ర కలిసి వచ్చారు.

ఇందులో ధన్ రాజ్ కు పెయిర్ గా వచ్చింది విష్ణుప్రియ. అయితే ఇందులో ఓ టాస్క్ ఇచ్చారు. పెండ్లి అంటే ఏం గుర్తుకు వస్తుందో చెప్పాలని కోరింది సుమ. దానికి విష్ణుప్రియ.. షాపింగ్, బంధువులు అని చెప్పగా… ధన్ రాజ్ మాట్లాడుతూ.. శుభ లేఖలు, కల్యాణ మండపం అని చెప్పాడు.

అనంతరం విష్ణుప్రియ మాట్లాడుతూ.. శోభనం అంటూ గట్టిగా అరిచేసింది. అది రాంగ్ ఆన్సర్.. నీకు పెండ్లి అంటే శోభనం గుర్తుకు వచ్చింది గానీ.. తాళిబొట్టు గుర్తుకు రాలేదా అంటూ పంచ్ వేశాడు వేణు. దెబ్బకు ఆ షో దద్దరిల్లిపోయింది. దాంతో విష్ణుప్రియ ముఖం వాడిపోయింది.

ఆ తర్వాత భార్యలు ఏ సమయంలో భర్తల్ని పట్టించుకోరు అని అడగ్గా.. షాపింగ్ అని బెట్టింగ్ పదివేలు పెట్టాడు ధన్ రాజ్. దానికి సుమ అభ్యంతరం చెప్పగా.. ఇరవైవేలు, ముప్పైవేలు అంటూ చెప్పింది విష్ణుప్రియ. ఈ వాయిస్ కోఠిలో విన్నట్టు ఉందే అంటూ సుమ మళ్లీ పంచ్ వేసింది. దెబ్బకు విష్ణుప్రియ నోరు మూసుకుంది. ఇలా ఆద్యంతం షో నవ్వులు పూయించింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us