Vishal : విశాల్‌పై పవన్ కళ్యాణ్ అభిమానుల తీవ్ర ఆగ్రహం.!
NQ Staff - December 21, 2022 / 10:59 AM IST

Vishal : ‘నేనూ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒకడిని. నన్ను కూడా మీ ఫ్యాన్స్ కుటుంబంలో చేర్చేసుకోండి..’ అంటూ తన తాజా చిత్రం ‘లాఠీ’ ప్రమోషన్ సందర్భంగా ఓ విద్యా సంస్థలో సినిమా ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు సినీ నటుడు, నిర్మాత విశాల్.
మరో సందర్భంలో, ‘నాకు పవన కళ్యాణ్ అంటే ఇష్టం, అభిమానం, ప్రేమ. కానీ, ఓటు మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వేస్తాను..’ అని ఇదే విశాల్ చెప్పాడు.
ఆంధ్రప్రదేశ్‌లో ఓటు లేదుగానీ..
‘నాకు ఆంధ్రప్రదేశ్‌లో ఓటు లేదు.. వుంటే, వైఎస్ జగన్‌కే ఓటు వేస్తాను..’ అని విశాల్ చెప్పడం గమనార్హం. ఓటు లేనప్పుడు ఎందుకలా వ్యాఖ్యానించడం.? పైగా, పవన్ కళ్యాణ్ అభిమానినే.. కానీ, ఓటు మాత్రం వైఎస్ జగన్‌కి వేస్తాననడంపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు.
‘పవనన్నని ప్రేమిస్తాం.. జగనన్నకి ఓటేస్తాం..’ అంటూ గతంలో ఓ నినాదాన్ని వైసీపీ తెరపైకి తెచ్చింది. దాంతో, కొంత రాజకీయ గందరగోళం జనసేన చుట్టూ ఏర్పడింది. విశాల్ కూడా అదే కుట్రలో భాగమయ్యాడంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. విశాల్‌ని ట్రోల్ చేస్తున్నారు.