Vishaka : విశాఖ లో వైసీపీ కి చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..ఇక విజయం వారికైనా..?

ycp vs tdp

Vishaka (విశాఖ): ఏపీలో గ్రామా పంచాయితీ ఎన్నికల పోరు జోరుగా సాగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో నామినేషన్లు దాఖలు పూర్తయ్యాయి. ఇక కొన్ని గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్, వార్డు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరికొన్ని ప్రాంతాలలో ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. ఇక విశాఖ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. అయితే విశాఖ టీడీపీకి కంచుకోట అంటారు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి విశాఖలో చావు దెబ్బ తగిలింది. తొలిసారిగా అక్కడ వైసీపీ పుంజుకుంది.

tdp party josh in vishaka patnam in local elections విశాఖ
TDP Party Josh in Vishaka Patnam in Local Elections

అయితే గ్రామా పంచాయితీ ఎన్నికల్లో తనదైన పోటీ ఇవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇక ఏదైనా పోగొట్టుకున్న చోటే వెతుకోవాలని చాల మంది చెబుతుంటారు. ఇక టీడీపీ ఇప్పుడు అదే అదే సూత్రాన్ని విశాఖలో ప్రయోగించాలని చూస్తుంది. ఇక దానికి టీడీపీ కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బాగానే కష్టపడుతున్నారు. అయితే విశాఖ రూరల్ జిల్లాలో వైసీపీ జోరుకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు.

ఒక ప్లాన్ ప్రకారం టీడీపీ అడుగులు వేస్తుంది. ఇక గత ఏడాది ఇదే సమయంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తే టీడీపీ కార్యకర్తలు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ గత సంవత్సరం వాళ్ళు చుసిన ఓటమిని మళ్ళి చూడకూడదని అనుకున్నారేమో కానీ.. ఏడాది గ్యాప్ లోనే టీడీపీ బాగా పుంజుకుంది. పోరాడితే పోయేది ఏముంది అన్న డేరింగ్ వారిలో కనిపిస్తోంది.ఎందుకు గెలవం అన్న ధీమా కూడా వస్తోంది.

ఇక తొలి దశ పోలింగ్ జరుగుతున్న అనకాపల్లి డివిజన్ లో టీడీపీ బాగానే ఆశలు పెట్టుకుంది. అధికార పార్టీతో సమ ఉజ్జీగా రాణిస్తామంటూ చెప్పుకొస్తున్నారు. ఇక దాదాపు 1800 పై చిలులు సర్పంచ్ పదవికి నామినేషన్లు పడ్డాయంటే జిల్లాలో పంచాయతీ హోరు తొలిదశ పోరు ఎలా ఉందో చెప్పేయవచ్చు. ఇక ఇపుడు రెండవ దశలో కూడా టీడీపీ తమ్ముళ్ళు అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అడ్డాగా ఉన్న నర్శీపట్నంలో టీడీపీ సైకిల్ ఈసారి బాగా పరుగులు తీయడం ఖాయమని అంటున్నారు.

అంతేకాక చోడవరం, ఎలమంచిలిలో గతంతో పోలిస్తే పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పాయక‌రావుపేటలో కూడా మంచి బలం టీడీపీకి కనిపిస్తోంది. మొత్తానికి ఈసారి రూరల్ జిల్లాలో తలెత్తుకుని తిరిగేలా తమ మద్దతుదారులను గెలిపించుకుంటామని క్లారిటీగా తమ్ముళ్ళు చెబుతున్నారు. మొత్తానికి టీడీపీ దూకుడుతో వైసీపీకి అచ్చమైన సినిమానే చూపిస్తోంది. ఈ దెబ్బతో విశాఖలో పసుపు సత్తా చాటడం ఖాయమని ఆ పార్టీ నేతలు గట్టిగానే చెబుతున్నారు.

Advertisement