Karthik Varma Dandu Got Car As Gift : విరూపాక్ష డైరెక్టర్ కు లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాతలు.. ఎన్ని లక్షలంటే..?
NQ Staff - June 28, 2023 / 11:44 AM IST

Karthik Varma Dandu Got Car As Gift : మొదటి సినిమాతో హిట్ కొట్టడం చాలామంది దర్శకులకు పెద్ద పరీక్ష. ఎందుకంటే మొదటి సినిమా హిట్ అయితేనే వారికి ఫ్యూచర్ ఉంటుంది. లేదంటే వారిని ఎవరూ పట్టించుకోరు. రాకరాక వచ్చిన అవకాశాన్ని చాలామంది ఒడిసిపట్టుకుంటున్నారు. ఇప్పుడు విరూపాక్ష డైరెక్టర్ కూడా ఇదే పని చేశాడు.
చేతబడి కాన్సెప్ట్ తో హరర్ సినిమాను తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతూ సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన మూవీ విరపాక్ష. సుకుమార్ శిష్యుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. పైగా దీనికి సుకుమార్ స్క్రీన్ ప్లే విషయంలో సాయం చేశాడు.

Virupaksha Producers Gifted An Expensive Car Karthik Varma Dandu
ఎంత సుకుమార్ సాయం చేసినా.. మూవీ క్రెడిట్ మొత్తం కార్తీక్ కు మాత్రమే దక్కుతుంది. అందుకే ఆయనకు నిర్మాతలు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.

Virupaksha Producers Gifted An Expensive Car Karthik Varma Dandu
ఈ విషయాన్ని తాజాగా కార్తీక్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపాడు. కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. బెంజ్ కారు సీ క్లాస్ మోడల్ ఇందులో కనిపిస్తోంది.

Virupaksha Producers Gifted An Expensive Car Karthik Varma Dandu
దీని ధర రూ.70లక్షల వరకు ఉంటుంది. ఇంత ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన మూవీ టీమ్ కు ఆయన థాంక్స్ చెప్పారు. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ఆయనకు అంతా విషెస్ చెబుతున్నారు. ఇలా దర్శకులకు కార్లు గిఫ్ట్ గా ఇవ్వడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా చాలా మందికి ఇచ్చారు.
Virupaksha is a life time memory for me.. I would like to extend my gratitude to my guru @aryasukku sir, my hero @IamSaiDharamTej and my producers @BvsnP sir and @dvlns sir for this wonderful gift ….. pic.twitter.com/VbmT5Oeiqa
— karthik varma dandu (@karthikdandu86) June 27, 2023