Virender Sehwag : రైలు ప్రమాదంలో చనిపోయిన వారి పిల్లలను ఉచితంగా చదివిస్తా.. సెహ్వాగ్ గొప్ప మనసు..!

NQ Staff - June 5, 2023 / 01:13 PM IST

Virender Sehwag : రైలు ప్రమాదంలో చనిపోయిన వారి పిల్లలను ఉచితంగా చదివిస్తా.. సెహ్వాగ్ గొప్ప మనసు..!

Virender Sehwag  : ఒడిశాలోని బాలసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఏకంగా మూడు రైళ్లు ఢీకొన్న ఘోరమైన ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 275 మంది చనిపోయారు. దాదాపు 950 మందికి పైగా గాయాల పాలు అయ్యారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కాగా ఈ ప్రమాదంపై ఇప్పటికీ రెస్క్యూ టీమ్ కృషి చేస్తోంది.

గాయపడిన వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ మాజీ డ్యాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఓ కీలక ప్రకటన చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి పిల్లలను తానే ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు.

ఆ పిల్లలందరినీ సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఉచితంగా చదివిస్తానని.. ఆ బాధ్యతలు తాను తీసుకుంటానని ఈ డాషింగ్ బ్యాట్స్​మన్ హామీ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని కాపాడేందుకు కృషి చేస్తున్న రెస్క్యూ టీమ్స్, మెడికల్ టీమ్స్, వాలంటీర్లకు సెహ్వాగ్ కృతజ్ఞతలు తెలిపాడు.

ఇక సెహ్వాగ్ మంచి మనసుకు అందరూ అభినందిస్తున్నారు. గతంలో కూడా సెహ్వాగ్ ఇలాంటి సహాయాలు ఎన్నో చేశాడు. నీలాంటి వ్యక్తి ఈ దేశానికి చాలా అవసరం అంటూ ఆయన అభిమానులు కొనియాడుతున్నారు. సెహ్వాగ్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు ఐపీఎల్ లో సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

 

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us