Virat Kohli : టీ 20 క్రికెట్‌కి గుడ్ బై చెప్ప‌నున్న కోహ్లీ.. అంత‌ర్గ‌త విభేదాలు కార‌ణ‌మా?

Virat Kohli : టీమిండియా మెషిన్‌ గన్‌ విరాట్‌ కోహ్లి భార‌త జ‌ట్టుకు త‌న సేవ‌ల‌ను అందించి ఎన్నో విజ‌యాలు అందించాడు. అయితే . టి20 ప్రపంచకప్‌ 2021 ముగిసిన తర్వాత కోహ్లి భావోద్వేగానికి గుర‌య్యాడు. ఎలాగైనా కప్‌ కొట్టాలనే కోరిక తీరకుండానే టి20 కెప్టెన్‌గా కోహ్లి కథ ముగిసిపోయింది.

virat saying Goodbye to T20
virat saying Goodbye to T20

బ్యాట్స్‌మన్‌గా సూపర్‌ సక్సెస్‌ అందుకున్న కోహ్లి కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌ నుంచి మొదలుకొని.. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌.. తాజాగా టి20 ప్రపంచకప్‌ వరకు కోహ్లికి కెప్టెన్‌గా కలిసిరాలేదనే చెప్పాలి. ఓవరాల్‌గా కోహ్లి టి20ల్లో 49 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. టీమిండియా 31 మ్యాచ్‌లు గెలిచి 16 ఓడిపోయింది.

63.27 శాతంతో కెప్టెన్‌గా మెరుగైన రికార్డు కలిగి ఉన్న కోహ్లికి ఎందుకో ఐసీసీ ఫార్మాట్‌లో మాత్రం దురదృష్టమే ఎదురవుతూ వస్తోంది. ఇక వన్డే, టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించనున్న కోహ్లి 2023 వన్డే వరల్డ్‌కప్‌ అయినా సాధిస్తాడా అనేది ప్రశార్నర్థకమే. ఎందుకంటే వన్డే కెప్టెన్సీలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందని.. రోహిత్‌కు వన్డే, టి20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పి.. కోహ్లిని కేవలం టెస్టు కెప్టెన్‌గా పరిమితం చేయాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.

ఈ క్రమంలో పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్ సంచలన వాఖ్యలు చేశాడు. టీమిండియాలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ, అందుకే కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని అతడు ఆరోపించాడు. “ఒక విజయవంతమైన కెప్టెన్ తాను కెప్టెన్సీనుంచి తప్పుకున్నాడంటే.. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం ఏమీ బాగాలేదని అర్థం.

all is not well not in dressing room says mustaq about kohli saying good bye to T20
all is not well not in dressing room says mustaq about kohli saying good bye to T20

నేను ప్రస్తుతం టీమిండియాలో రెండు గ్రూపులను చూస్తున్నాను. ఒకటి ఢిల్లీ గ్రూప్, రెండోది ముంబై. కోహ్లి త్వరలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ నుంచి రిటైర్ అవుతాడని, కేవలం ఐపీఎల్‌లోనే కొనసాగుతాడని నేను భావిస్తున్నాను. టీ20 ప్రపంచకప్‌లో ఐపీఎల్ కారణంగానే భారత్ ఓడిపోయింది.

all is not well not in dressing room says mustaq about kohli saying good bye to T20
team india Dressing room

ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీకి ముందు సుదీర్ఘకాలం బయోబబుల్‌లో ఉండటం టీమిండియా ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీసింది” అని అతడు జియో న్యూస్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.