Virat kohli: రన్ మెషీన్ విరాట్ కోహ్లీ- అందాల ముద్దుగుమ్మ అనుష్క ముద్దుల కూతురు వామికని చూడాలని వారి అభిమానులు కలలు కంటున్నారు. ఈ క్రమంలో విరుష్క జోడి వామికను పరిచయం చేయకుండానే టీవీలో ప్రత్యక్షమైంది.సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో అనుష్క శర్మతో ఉన్న వామికా కెమెరా కంటికి చిక్కింది. గతేడాది కాలంగా మీడియా కంటపడకుండా.. ఫొటోలు రిలీజ్ చేయకుండా తమ కూతుర్ని దాస్తున్న కోహ్లీ-అనుష్కల ప్రయత్నం భగ్నమైంది.


సఫారీ టూర్ కు విరాట్ కోహ్లీ సతీసమేతంగా వచ్చాడు. అయితే కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేకు అనుష్క శర్మ వామికాతో కలిసి హాజరైంది. అక్కడ వారిద్దరూ కలిసి ఉన్న దృశ్యం టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ తర్వాత అనుష్క శర్మ, వామికా కెమెరాకు చిక్కారు.
విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ తర్వాత వామికను ఉద్దేశించి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. రీప్లేలో కనిపించడంతో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు ఈ ఫొటో, వీడియోను ట్రెండింగ్ చేస్తూ విపరీతంగా లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం కోహ్లీలానే ఉందంటూ అభిమానులు పొంగిపోతున్నారు.
అయితే తమ కూతురి చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ ప్రైవసీని గౌరవించాలంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. హాయ్ గాయ్స్, నిన్న స్టేడియంలో మా కుమార్తె చిత్రాలు క్యాప్చర్ చేయబడ్డాయి, ఆ తర్వాత విస్తృతంగా షేర్ చేయబడ్డాయి అని మేము గ్రహించాము. అయితే ఇంతకముందు వివరించిన కారణాల వలన వామికా చిత్రాలు ప్రచురించడం, క్లిక్ చేయడం వంటివి చేయోద్దని అభ్యర్ధిస్తున్నాము అంటూ విరాట్ తన ఇన్‌స్టాగ్రాములో పేర్కొన్నాడు.

కోహ్లి 63 బంతుల్లో 64వ వన్డే అర్ధ సెంచరీని సాధించాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ, కుమార్తె వామిక కూడా స్టాండ్స్‌లో ఈ అర్థ సెంచరీకి సాక్షులుగా నిలిచారు. కోహ్లి అనుష్క, కుమార్తె వైపు చూసి కరచాలనం చేస్తూ, బ్యాట్ చూపించి, ఆపై కుమార్తెను ఒడిలో ఊపుతున్న శైలిలో అర్ధ సెంచరీ వేడుక చేసుకున్నాడు. కోహ్లి హాఫ్ సెంచరీ వేడుకలో అనుష్క కూడా పాల్గొని కూతురుతో పాటు చప్పట్లు కొట్టింది. ఈ సందర్భంగా కోహ్లీ కూతురు చిత్రాలు కూడా తెరపైకి వచ్చాయి.