Virat Kohli : టీ20లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. అతనికే సాధ్యమిది..!
NQ Staff - April 27, 2023 / 11:45 AM IST

Virat Kohli : క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ తలచుకుంటే ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. మొదటి నుంచి కోహ్లీ ఆర్సీబీ తరఫునే ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా ఆర్సీబీ నుంచే ఆడుతున్నాడు కోహ్లీ. ఇప్పటి వరకు ఆర్సీబీ ట్రోఫీ అందుకోలేదు. కానీ ఆ టీమ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
అయితే తాజాగా విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ సీజన్-16 లో భాగంగా నిన్న కోలకతాతో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓడిపోయింది. కేకేఆర్ ఇచ్చిన భారీ టార్గెట్ ను రీచ్ కాలేక ఆర్సీబీ తడబడింది.
ఈ మ్యాచ్ లో కోహ్లీ 37 బంతుల్లో 54 పరుగులు చేసి ఆశలు రేపాడు. కానీ త్వరగానే ఔట్ అయ్యాడు. ఆ వెంటనే డుప్లెసిస్ 7 బంతుల్లో 17 పరుగులు, మాక్స్‌వెల్ 5 పరుగుల తక్కువ స్కోరుకే ఔట్ అయ్యారు. దాంతో టీమ్ ఓడిపోయింది. కానీ కోహ్లీ అరుదైన రికార్డు నమోదు చేశాడు. చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ ఇప్పటి వరకు టీ20లో 3 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డుకెక్కాడు.
ఒకే గ్రౌండ్ లో ఇన్ని పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా ఆయన చరిత్ర సృష్టించాడు. ఇక దాంతో పాటు కేకేఆర్ మీద అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్ గా నిలిచాడు. ఈ లిస్టులో డేవిడ్ వార్నర్ 1075, రోహిత్ 1040 పరుగులతో తొలి రెండో స్థానంలో ఉన్నారు. వారిద్దరి తర్వత కోహ్లీ ఉన్నాడు.