Virat Kohli : వీడియో : రోహిత్‌ – కోహ్లీ లను చూసి మురిసిపోతున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌

NQ Staff - September 26, 2022 / 03:09 PM IST

Virat Kohli : వీడియో : రోహిత్‌ – కోహ్లీ లను చూసి మురిసిపోతున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌

Virat Kohli : టీమిండియా నిన్న ఆస్ట్రేలియా పై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ విజయాన్ని… ఉత్కంఠభరిత మ్యాచ్ ని చూసే అవకాశం ఉప్పల్ స్టేడియంలో జరిగేటడంతో తెలుగు వారికి దక్కింది. కేవలం ఆ మ్యాచ్ విజయం మాత్రమే కాకుండా మ్యాచ్‌ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ల మధ్య ఉన్న బాండింగ్ కూడా బయట పడింది.

ఆ మధ్య ఒకరినొకరు విమర్శించుకుంటూ గొడవలు పడ్డ వీరిద్దరూ కలిసి ఏం ఆడుతారో అని అంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఒకరి కెప్టెన్సీలో ఒకరు ఆడలేం అంటూ సన్నిహితుల వద్ద గతంలో వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

అలాంటి వీరిద్దరూ కీలకమైన వరల్డ్ కప్ ముందు ఇలా క్లోజ్ గా కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిన్నటి మ్యాచ్‌ లో బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ సక్సెస్ అయిన సందర్భంగా రోహిత్ శర్మ అభినందించిన తీరు మరియు మ్యాచ్ విజయం తర్వాత వారిద్దరు ఒకరినొకరు ఆ లింగం చేసుకొని అభినందించుకున్న తీరు అందరిని ఆకర్షిస్తుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరి మధ్య ఇంత మంచి బాండింగ్ ఉండగా కొందరు కొన్ని రకాలుగా కామెంట్స్ చేస్తున్నారని.. ఇదే బాండింగ్ తో వీళ్ళు కంటిన్యూ అయితే కచ్చితంగా టీ20 వరల్డ్ కప్ మనదే అంటూ క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us