Virat Kohli And Gautam Gambhir : మళ్లీ గంభీర్ వర్సెస్ కోహ్లీ.. మైదానంలోనే మాటల తూటాలు..!
NQ Staff - May 2, 2023 / 09:16 AM IST

Virat Kohli And Gautam Gambhir : ఇండియన్ స్టార్ క్రికెటర్లు కోహ్లీ, గౌతమ్ గంభీర్ కు ఎప్పటి నుంచో అస్సలు పడట్లేదు. వీరిద్దరూ తరచూ గొడవ పడుతూనే ఉంటారు. ఇక ఐపీఎల్ వచ్చిందంటే వీరిద్దరి మధ్య ఏదో ఒక మ్యాచ్ లో గొడవ జరగడం కామన్ అయిపోయింది. తాజాగా ఆర్సీబీ, లక్నో మ్యాచ్ లో ఇది మరోసారి రిపీట్ అయింది.
తాజాగా జరిగిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో లక్నో ఓడిపోయింది. మామూలుగానే ఫైర్ మీద కనిపించే కోహ్లీ ఈ మ్యాచ్ లో మరింత అగ్రెసివ్ గా కనిపించాడు. ఇక మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో కోహ్లీ లక్నో ప్లేయర్ కైల్ మేయర్స్‌తో కోహ్లీ మాట్లాడుతున్నాడు.
అప్పుడే అక్కడకు వచ్చిన గంభీర్.. కోహ్లీతో మాట్లాడొద్దని సైగ చేసి కైల్ ను పక్కకు తీసుకెళ్లాడు. దాంతో కోహ్లీ రియాక్ట్ కావడంతో గంభీర్ సీరియస్ అయ్యాడు. అలా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. చివరకు అమిత్ మిశ్రా కోహ్లీని పక్కకు తీసుకెళ్లాడు. ఇటు గంభీర్ ను కేఎల్ రాహుల్ పక్కకు తీసుకెళ్లాడు.
అయితే వీరిద్దరి గొడవకు ఈ రెండు టీమ్స్ మధ్య బెంగుళూరులో జరిగిన మ్యాచ్ కారణమని తెలుస్తోంది. ఆ మ్యాచ్ లో ఒక వికెట్ తేడాతో ఆర్సీబీ ఓడిపోయింది. అప్పుడు ఆర్సీబీ అభిమానులను నోరు మూసుకోవాల్సిందిగా గంభీర్ సౌగ చేశాడు. అందుకే కోహ్లీ ఈ మ్యాచ్ లో ఇలా రెచ్చిపోయినట్టు తెలుస్తోంది.